కూతురితో రాజేంద్రప్రసాద్‌కి గొడవ, కొన్నేళ్లుగా మాటల్లేవ్‌.. ఇద్దరిని కలిపిన స్టార్‌ రైటర్‌, అసలేం జరిగిందంటే ?

First Published Oct 5, 2024, 2:04 PM IST

రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెతో చాలా రోజులు మాట్లాడలేడు రాజేంద్రప్రసాద్‌. మరి ఆ గొడవకి కారణమేంటి? ఎలా కలిశారనేది చూస్తే. 
 

టాలీవుడ్‌లో నటకిరీటిగా పేరు తెచ్చుకున్నారు రాజేంద్రప్రసాద్‌. కామెడీ చిత్రాల హీరోగా ఆయన మెప్పించారు. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్‌, రాజశేఖర్‌, సుమన్‌, జగపతిబాబు, అర్జున్‌ వంటి వారికి పోటీగా రాజేంద్రప్రసాద్‌ సినిమాలు చేసి హిట్లు కొట్టారు. కామెడీ చిత్రాలైనా కమర్షియల్‌ అంశాలు, యాక్షన్‌ సీన్లకి కొదవలేదనే చెప్పాలి. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ అందుకున్నారు రాజేంద్రప్రసాద్‌. ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు బలమైన క్యారెక్టర్స్ తో మెప్పిస్తున్నారు. ఇప్పుడు కూడా ఏ పాత్ర చేసినా, అందులో ఫన్‌ ఉండేలా ఆయన పాత్రని మేకర్స్ తీర్చిదిద్దడం విశేషం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న రాజేంద్రప్రసాద్‌.. ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఒక్కగానొక్క కూతురు గాయత్రి కన్నుమూసింది. ఆమె శనివారం ఉదయం గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషాదంతో రాజేంద్రప్రసాద్‌ కన్నీరుమన్నీరవుతున్నారు. రాజేంద్రప్రసాద్‌కి కొడుకుతోపాటు కూతురు గాయత్రి సంతానం.

ఆమె మరణం ఆయన ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తన నివాసంలోనే కూతురు భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు రాజేంద్రప్రసాద్‌. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళ్లు అర్పిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌ని ఓదార్చుతున్నారు. వెంకటేష్‌, అనిల్‌ రావిపూడితోపాటు ఎర్రబెల్లి దయాకర్‌ రావు వంటి వారు హాజరై గాయత్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. రేపు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. 
 

Latest Videos


ఇదిలా ఉంటే ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ పాత వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది. ఇందులో తన కూతురు గురించి చెప్పారు రాజేంద్రప్రసాద్‌. కూతురు గాయత్రితో ఉన్న గొడవ ఏంటో తెలిపారు. కూతురుతో ఆయనకు మాటల్లేవట. ఏం జరిగిందనేది ఆయన వెల్లడించారు. `బేవార్స్` అనే సినిమా ఈవెంట్‌లో అసలు విషయం తెలిపారు రాజేంద్రప్రసాద్‌.

అందులోని `తల్లీ తల్లి నా చిట్టి తల్లి` అంటూ సాంగే పాట తనకు ఎంతగానో కనెక్ట్ అయ్యిందని చెప్పారు. ఆ పాట విని బోరున విలపించాడట. ఆ పాటని స్టార్‌ రైటర్‌ సుద్దాల అశోక్‌ తేజ రాయడం విశేషం. సినిమాలో కూతురు చనిపోయినప్పుడు వచ్చే పాట అది, ఆ పాటని రాయమని సుద్దాలని అడిగాడట రాజేంద్రప్రసాద్‌. దీంతో ఆయన అంతటి అద్భుతంగా రాశాడట. ఆ పాట విని తట్టుకోలేకపోయినట్టు తెలిపారు రాజేంద్రప్రసాద్‌. 
 

తాను పదేళ్లు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. ఆ సమయంలో తాను పెద్దగా ఏడవలేదు. కానీ తల్లిని తన కూతురులో చూసుకున్నాడట. గాయత్రి అంటే తనకు ఎంతో ప్రేమ అని తెలిపారు రాజేంద్రప్రసాద్‌. కానీ పెద్దయ్యాక గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనకు ఇష్టంలేని మ్యారేజ్‌ చేసుకోవడంతో రాజేంద్రప్రసాద్‌ హార్ట్ బ్రేక్‌ అయ్యింది. దీంతో గుండెపగిలేలా ఏడ్చాడట.

ఈ విషయాన్ని ఆ ఈవెంట్‌లో చెబుతూ, సుద్దాల రాసిన ఆ పాట ఎంత అద్భుతంగా ఉందో చెబుతూ, ఆ పాట విని తాను ఎంతగానో ఏడ్చానని, తెలిపారు. ఇక్కడే మరో విషయాన్ని తెలిపారు. తన కూతురు లవ్‌ మ్యారేజ్‌ చేసుకుని వెళ్లిపోయిందని, దీంతో ఆమెతో తాను మాట్లాడనని చెప్పాడు. అయితే ఆ పాట విన్నాక ఆమెతో అప్పటి వరకు మాట్లడకపోయినా ఇంటికి పిలిపించుకుని నాలుగుసార్లు వినిపించి ఏడ్చాడట రాజేంద్రప్రసాద్‌. 
 

అప్పటి వరకు కూతురుతో ఆయనకు మాటలు లేవు. వారిని క్షమించలేకపోయాడు. కానీ ఆ పాట విన్నాక, ఆ పాట ద్వారా సుద్దాల అశోక్ తేజ చేసిన మ్యాజిక్ కారణంగా తాను మళ్లీ కూతురుని కలిసినట్టుగా తెలిపారు. అప్పట్నుంచి వీరంతా కలిసిపోయారు. ఇక గాయత్రి న్యూట్రిషన్‌ గా సలహాలిస్తుంటారు. ఆమె భర్త మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి పాప సాయి తేజస్విని ఉన్నారు. ఆ అమ్మాయి పలుసినిమాల్లో బాలనటిగా నటించింది. ముఖ్యంగా `మహానటి` సినిమాలో బాల సావిత్రిగా అలరించింది గాయత్రి కూతురే కావడం విశేషం. 
 

click me!