ఆ ఒక్క విషయంలో అన్న చిరంజీవినే ఎదిరించిన పవన్ కళ్యాణ్, అంత సాహసం ఎలా చేశాడు?

First Published | Oct 5, 2024, 12:31 PM IST

మెగా బ్రదర్స్ చాలా అన్యోన్యంగా ఉంటారు. కాగా చిరంజీవికి నాగబాబు కంటే పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ఇష్టం. అందుకు కారణం ఏమిటో ఓ సందర్భంలో చిరంజీవి నేరుగా చెప్పాడు. 
 

Chiranjeevi

చిరంజీవి తెలుగు సినిమాపై చెరగని ముద్రవేశారు. మెగా ఫ్యామిలీ అనే ఒక వృక్షాన్ని నాటారు. చిరంజీవి అనంతరం హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్స్ అయ్యారు. సాయి ధరమ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సైతం కొంత మేర సక్సెస్ అయ్యారు. 

Chiranjeevi

అయితే నాగబాబు మాత్రం ఎదగలేకపోయారు. హీరోగా ప్రయత్నం చేసిన నాగబాబు సక్సెస్ దక్కకపోవడంతో నటుడు అయ్యారు. నాగబాబును నిర్మాతగా చూడాలని చిరంజీవి ఆశించారు. కానీ నాగబాబును దురదృష్టం వెంటాడింది. మెగా హీరోలతో ఆయన చేసిన ఒక్క సినిమా కూడా ఆడింది లేదు. ఆరంజ్ మూవీ మిగిల్చిన నష్టాలతో నాగబాబు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదురైంది. 

జబర్దస్త్ జడ్జిగా మారి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడ్డారు నాగబాబు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం చిరంజీవికి ధీటుగా ఎదిగారు. అశేష అభిమాన గణాన్ని సంపాదించారు. కాగా తన ఇద్దరు తమ్ముళ్లలో చిరంజీవికి పవన్ కళ్యాణ్ అంటేనే ఇష్టం అట. ఈ విషయాన్ని ఆయన ఓ సందర్భంలో నేరుగా వెల్లడించారు.


Chiranjeevi

మీరు ప్రతిసారి నాగబాబు కంటే పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే.. మీ కళ్ళల్లో ఆ ఆద్రత, ఆప్యాయత కనిపిస్తుంది. రామ్ చరణ్ వలె పవన్ కళ్యాణ్ ని మీరు భావిస్తారు. అందుకు కారణం ఏమిటని అడగ్గా... చిరంజీవి ఈ విధంగా సమాధానం చెప్పారు. 


నేను పరిశ్రమకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న పిల్లవాడు. నాలుగో తరగతో ఐదో తరగతో చదువుతున్నాడు. కొన్నాళ్ళు చెన్నైలో మా దగ్గరే చదువుకున్నాడు. తర్వాత నెల్లూరు వెళ్ళాడు. నన్ను, సురేఖను అమ్మానాన్నగా భావించేవాడు. మా ఇంట్లో పెరిగాడు. 
 

పవన్ కళ్యాణ్, మా చిన్న చెల్లి పుట్టేనాటికి నేను చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళాను. ఎప్పుడో ఒకసారి సెలవులకు వీళ్ళను కలవడానికి కుదిరేది. దాని వలన పవన్ కళ్యాణ్ ని నేను చాలా మిస్ అయ్యేవాడిని.. అని అన్నారు. చిరంజీవి ఓ సందర్భంలో చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

కాగా గతంలో పవన్ కళ్యాణ్-చిరంజీవి రాజకీయం విభేదించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పీఆర్పీ పార్టీని చిరంజీవి విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని కలపడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. సొంత అన్నయ్య మీద విమర్శలు గుప్పించాడు. 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చిరంజీవి అనంతరం స్పందించారు. పవన్ కళ్యాణ్ కి ఆవేశం ఎక్కువ. చిన్నపిల్లల మనస్తత్వం. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కొన్నాళ్ళు ఇద్దరూ కలవలేదు. ఎడమొహం పెడముహంగా ఉన్నారు. అనంతరం మెల్లగా కలిసిపోయారు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. 

ఆ ఏడాది జరిగిన ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. అయితే టీడీపీకి తన మద్దతు ప్రకటించింది. 2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అధికారం చేపట్టింది. అనంతరం టీడీపీతో విభేదించిన పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు ఘోర ఓటమి ఎదురైంది. 

2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. పవన్ కళ్యాణ్ గెలుపుకు చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ తీవ్రంగా కృషి చేశారు. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించాలని వీడియో బైట్ విడుదల చేశారు. రామ్ చరణ్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు పిఠాపురం వెళ్లారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ నేరుగా ప్రచారం చేశారు. 

జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాడు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే చిరంజీవిని పవన్ కళ్యాణ్ కలిశారు. అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. 

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

Latest Videos

click me!