రాజమౌళి ఫ్యామిలీ మూవీ `తెల్లవారితే గురువారం` యూఎస్‌ ప్రీమియర్‌ షో రివ్యూ

First Published | Mar 27, 2021, 8:50 AM IST

రాజమౌళి ఫ్యామిలీ నుంచి వస్తోన్న చిత్రం `తెల్లవారితే గురువారం`. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా, మరో కుమారుడు కాళభైరవ సంగీత దర్శకుడిగా పనిచేసిన చిత్రమిది. మణికాంత్‌ గెల్లి దర్శకత్వం వహించారు. మరి శనివారం(మార్చి 27) విడుదలవుతున్న ఈ సినిమా ప్రీమియర్‌ రివ్యూ చూద్దాం. 

రాజమౌళి ఫ్యామిలీ అనే టైటిల్‌ కార్డ్ తో వస్తోన్న చిత్రం `తెల్లవారితే గురువారం`. రాజమౌళి పేరుతోనే ఇది బోలెడంతా ప్రమోషన్‌ సంపాదించింది. దీనికి తోడు ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి యంగ్‌ టైగర్‌, కొమురంభీమ్‌ ఎన్టీఆర్‌ వచ్చి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. అంతేకాదు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ బెస్ట్ విషెస్‌ చెబుతూ ట్వీట్‌ కూడా చేశారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. `మత్తు వదలరా` తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా రిజల్ట్ ఏంటీ? ఎలా ఉందనేది యూఎస్‌ ప్రీమియర్స్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే.. పెళ్లి ఈవెంట్‌తో సినిమా ప్రారంభమవుతుంది. హీరో శ్రీసింహా(వీరు పాత్ర పేరు), హీరోయిన్‌ మిషా నారంగ్‌(మధు పాత్ర పేరు) లకు పెళ్లి జరుగుతుంటుంది. కానీ ఈ పెళ్లిని ఎలాగైనా క్యాన్సిల్‌ చేయాలని శ్రీసింహా ప్రయత్నిస్తుంటాడు. ఇది వీరిద్దరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి. అందుకే హీరోకి నచ్చలేదు. మ్యారేజ్‌ని రద్దు చేయించేందుకు నానా పాట్లు పడుతుంటారు. ఆయన అలా చేయడానికి కారణం మరో హీరోయిన్‌ చిత్ర శుక్లా(కృష్ణవేణి పాత్ర పేరు)తో ప్రేమలో ఉంటారు. దీంతో ప్రేమించిన అమ్మాయి కోసం ఈ మ్యారేజ్‌ క్యాన్సిల్‌ చేయించాలనుకుంటాడు. మరి అతని ప్రయత్నం ఫలించిందా? మరో అమ్మాయితో ఆయన లవ్‌ స్టోరీ ఎలా సాగింది? పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైంది? అనే అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన చిత్రమిది. చాలా చిన్నగా చేసిన ప్రయత్నమైనా ఆకట్టుకునేలా ఉంది. రొమాంటిక్‌ కామెడీ చిత్రాల్లో ఇదొక స్పెషాలిటీని సొంతం చేసుకుందని చెబుతున్నారు. ఈ చిత్రం సరదాగా సాగిపోతుందని, అక్కడక్కడ ఉక్కిరి బిక్కిరి చేస్తుందని అంటున్నారు. జెన్యూన్‌ కామెడీ అలరిస్తుందని టాక్‌. అయితే ఈ చిత్రాన్ని నడిపించిన విధానం చాలా కొత్తగా ఉంటుందంటున్నారు. సత్య, వైవా హర్ష మధ్య వచ్చేసన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయట. హిలేరియస్‌ కామెడీని పంచారని చెబుతున్నారు.
సంగీతం సినిమాకి ప్లస్‌ అని, కాళభైరవ మరోసారి అద్బుతమైన సంగీతాన్ని అందించారని అంటున్నారు. ఎడిటింగ్‌,సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. దర్శకుడిగా మణికాంత్‌ తొలి చిత్రంతోనే తన సత్తా చాటాడని, సినిమాని బాగా లీడ్‌ చేశారనే టాక్‌ వినిపిస్తుంది.
అదే సమయంలో హీరో శ్రీసింహా మంచి నటుడు అవుతాడనేలా నటించాడని, ఆయన నటన కట్టిపడేస్తుందని చెబుతున్నారు. ఎమోషన్స్ సన్నివేశాలు బాగా పలికించాడట.
సినిమాలో శ్రీసింహా, మిషా నారంగ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు, క్యూట్‌ కెమిస్ట్రీ మెస్మరైజ్‌ చేస్తుందట. అలాగే చిత్ర శుక్లా సైతం తన అందం, అభినయంతో కట్టిపడేసిందంటున్నారు. అదే సమయంలో కాస్త నెగటివ్‌ టాక్‌ కూడా వినిపిస్తుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ చాలా లాగ్‌ ఉందట. రొటీన్‌ లవ్‌ స్టోరీ అని, కథలో కొత్తదనం లేదని చెబుతున్నారు.
అయితే ఇందులో యాక్సిడెంట్‌ ఎపిసోడ్‌ సినిమాని మరో మలుపు తిప్పిందని, ఇంటెన్స్‌గా మారిపోయిందటున్నారు. ఈ సందర్భంలో వచ్చే బీజీఎం, ఎమోషనల్‌ సీన్స్ కట్టిపడేస్తాయట. చివరికి వీరు, మధుల అరెంజ్‌ మ్యారేజ్‌ జరుగుతుందని, దీంతో సినిమా ముగుస్తుందని తెలుస్తుంది. మొత్తంగా సినిమాపై మిక్స్ డ్‌ టాక్‌ వస్తుంది. చాలా వరకు పాజిటివ్‌ రిపోర్ట్ వస్తున్నట్టుగా ఉంది. పూర్తి స్థాయి రివ్యూ కోసం వేచి ఉండండి.

Latest Videos

click me!