`ప్రేమదేశం` వినీత్‌ చేసిన తప్పు అదేనా?.. కెరీర్‌ విషయంలో జరిగిందేంటి?

First Published Jun 5, 2021, 8:55 PM IST

`ప్రేమదేశం` సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ అయిన వినీత్‌.. తెలుగులో చేసిన తప్పేంటి? సక్సెస్‌ కాలేకపోవడానికి కారణం ఏంటి? టాలీవుడ్‌ కి దూరమవడానికి కారణాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే? 

వినీత్‌ పేరు చెబితే `ప్రేమ దేశం` సినిమానే గుర్తొస్తుంది. `ప్రేమ దేశం` సినిమా పేరు విన్నా అబ్బాస్‌, వినీత్‌లే గుర్తొస్తారు. అంతగా ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో అంతటి ప్రభావాన్ని చూపించారు. `ప్రేమ దేశం` సినిమా ట్రెండ్‌ సృష్టించడంతో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయారు. అప్పట్లో యూత్‌ ఈ సినిమా తెగ ఫాలో అయ్యేవాళ్లు. వీరి హెయిర్‌ స్టయిల్‌ని, డ్రెస్సింగ్‌తోపాటు నడవడికని సైతం ఫాలో అయ్యారు. చివరికి ప్రేమ విషయంకూడా. అంతగా ఇది ప్రభావాన్ని చూపించింది.
undefined
ఈ సినిమా తర్వాత వినీత్‌ తెలుగులో కొన్ని సినిమాలు చేశారు. కానీ ఆయన పేరు చెబితే ఇప్పటికీ `ప్రేమదేశం` సినిమానే గుర్తొస్తుంది. అంటే మిగిలిన సినిమాలు ఆ స్థాయిలో ఆడలేదు. దీనికితోడు వినీత్‌ ప్రేమ కథలకే సెట్‌ అవుతాడనే ముద్ర పడింది. హీరోగా లాంగ్‌ రన్‌ కావాలంటే లవ్‌ స్టోరీలతోపాటు కమర్షియల్‌, మాస్‌, యాక్షన్‌ సినిమాలు కూడా చేయాలి. అప్పుడే లాంగ్‌ రన్‌ ఉంటుంది. పెద్ద హీరోలంతా తొలి నాళ్ల నుంచి మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేసే ఈ స్థాయికి వచ్చారు. కానీ వినీత్‌ విషయంలో అలా జరగలేదు. ఆయన ప్రేమ కథలకే పరిమితమయ్యారు. లవర్‌బాయ్‌ ఇమేజే ఆయనకు దెబ్బేసింది.
undefined
ప్రేమ కథలు కొన్నింటికే పరిమితం చేస్తాయి. దాన్ని దాటుకుని హీరోగా రాణించడంలో వినీత్‌ సక్సెస్‌ కాలేకపోయాడు. `ప్రేమ పల్లకి`, `ఆరో ప్రాణం`, `రుక్మిణి`, `వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్`, `పాడుతా తీయగా` ఇలా వరుస సినిమాలు చేసినా పెద్దగా హిట్స్ అందుకోలేకపోయాడు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారి `లాహిరి లాహిరి లాహిరిలో`, `బాపు బొమ్మకు పెళ్ళంట` వంటి చిత్రాల్లో నటించాడు. ఇవన్నీ ఆశించిన స్థాయిలో పెద్ద విజయాలు సాధించలేకపోయాయి.
undefined
మరోవైపు వినీత్‌ తెలుగులో రాణించలేకపోవడానికి తెలుగు భాష రాకపోవడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. స్వతహాగా మలయాళానికి చెందిన వినీత్‌ తెలుగు భాషపై దృష్టి పెట్టలేదు. డబ్బింగ్‌ చెప్పడం అన్ని సార్లు కుదరదు. మేకర్‌ ఇదే విషయంలో ఇబ్బంది పడుతుంటారు. అందుకే వినీత్‌కి అవకాశాలు తగ్గిపోయాయనే టాక్‌ వినిపించింది. దీంతోపాటు వినీత్‌ మాస్‌ పాత్రలకు సూట్‌ కాడనే టాక్‌ పడిపోయింది.
undefined
అదే సమయంలో వినీత్‌కి మలయాళంలో ఆఫర్స్ వచ్చాయి. ఆయన మొదటి నుంచి మలయాళంలో పెద్ద హీరోగా రాణిస్తున్నారు. దీంతో మళ్లీ ఆయన మాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టాడు. దీంతో ఆటోమెటిక్‌గా తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. వినీత్‌ కూడా తర్వాతి కాలంలో టాలీవుడ్‌ని లైట్‌ తీసుకున్నాడు.
undefined
2006లో నటించి `థాంక్స్` సినిమా తర్వాత వినీత్‌ ఎక్కువగా కనిపించలేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇటీవల నితిన్‌ హీరోగా నటించిన `రంగ్ దే` మూవీలో కనిపించాడు. మంచి పాత్రలు వస్తే తప్ప తెలుగులో నటించనని వినీత్‌ భావిస్తున్నారట. మరి మళ్లీ తెలుగులో రీఎంట్రీ వర్కౌట్‌ అవుతుందా? ఆయనకు ఆఫర్స్ వస్తాయా? అన్నది చూడాలి.
undefined
వినిత్‌ స్వతహాగా నటుడు మాత్రమే కాదు క్లాసికల్‌ డాన్సర్‌ కూడా. పలు సినిమాలకు కొరియోగ్రాఫీ కూడా చేశారు. పెద్ద నటులకు డబ్బింగ్‌ కూడా చెబుతున్నారు. 2004లో వినీత్‌..ప్రిసిల్లా మీనన్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు అవంతి ఉన్నారు.
undefined
click me!