మెస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ నగ్మ గురించి మాట్లాడుకోవాలి.. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. సౌత్.. నార్త్ హీరోలతో నటించి మెప్పించింది. కాని ఈ ముద్దు గుమ్మ 50 ఏళ్లు దాటినా పెళ్ళి చేసుకోలేదు. ఇక పెళ్ళి ఊసెత్తని హీరోయిన్లలో టబు కూడా ఒకరు. గ్లామర్ హీరోయిన్ గా 90స్ లో వెండితెరను ఒక ఊపుఊపేసిన ఈ తార.. ప్రస్తుతం గ్లామర్ కలిగిన క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. కాని 52 ఏళ్ళు వచ్చినా పెళ్ళి మాత్రం చేసుకోలేదు. వీళ్లే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏజ్ బార్ అవుతున్నా పెళ్లిళ్లు చేసుకోని తారలు చాలా మంది ఉన్నారు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, గ్రేట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తి.. ఒకప్పటి అందాల తార, క్లాసికల్ డాన్సర్ శోభన కూడా పెళ్ళి చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతున్నారు.