సాయి ధరమ్ తేజ్ నిజంగానే కోమాలో ఉన్నాడా ? టెన్షన్ లో పెట్టిన పవన్, దాచి పెడుతున్నారా!

First Published Sep 26, 2021, 10:06 AM IST

పవన్ కళ్యాణ్ గత రాత్రి రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.

పవన్ కళ్యాణ్ గత రాత్రి రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. నేరుగా పవన్ జగన్ ప్రభుత్వాన్ని, ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తప్పుబడుతూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కావాలంటే తన సినిమాలు బ్యాన్ చేయాలని, చిత్ర పరిశ్రమని ఇబ్బందులకు గురి చేయొద్దని కోరారు. 

వైసీపీకి మద్దతు తెలుపుతున్న మోహన్ బాబు లాంటి వారు చిత్ర పరిశ్రమకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో, దేశంలో ఇన్ని సమస్యలు ఉండగా.. మీడియా మాత్రం కేవలం సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నే పదే పదే చూపించడం ఏంటి అని పవన్ మీడియాని ప్రశ్నించారు. దాదాపు గంట పాటు పవన్ వైసిపి పై విరుచుకుపడుతూ ప్రసంగాన్ని కొససాగించారు. 

తన స్పీచ్ మధ్యలో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అభిమానులందరినీ టెన్షన్ లోకి నెట్టేసాడు. అమాయకుడు సాయిధరమ్ తేజ్.. తన కర్మ కొద్దీ ప్రమాదానికి గురయ్యాడు. ఇంకా కళ్ళు కూడా తెరవలేదు. కోమాలోనే ఉన్నాడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేశారు. 

కానీ ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ, అపోలో వైద్యులు మాత్రం తేజు కోలుకుంటున్నాడని, త్వరలో డిశ్చార్జి అవుతాడని చెబుతూ వచ్చారు. తేజు సొంతంగానే శ్వాస తీసుకుంటుండడంతో వెంటిలేటర్ నుంచి తొలగించినట్లు కూడా వైద్యులు అధికారికంగా ప్రకటించారు. కానీ రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ చేసిన కామెంట్స్ భిన్నంగా ఉన్నాయి. 

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి మెగా ఫ్యామిలీ, వైద్యులు ఏమైనా దాచి పెడుతున్నారా అనే సందేహాలు కలగక మానదు. ఇదిలా ఉండగా మరికొంతమంది పవన్ కామెంట్స్ ని అలా అర్థం చేసుకోకూడదు అని అంటున్నారు. దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైన తేజు ఇంకా కోలుకోకముందే మీడియా అతడిని టార్గెట్ చేయడం పట్ల ఆవేదనతో పవన్ అలా కామెంట్స్ చేశాడని అంటున్నారు. 

తేజు ఇంకా పూర్తిగా కోలుకోలేదన్నది వాస్తవం. దానిని పవన్ ఇంకా కళ్ళు తెరవనేలేదు అంటూ ఆవేదన భరితంగా చెప్పి ఉంటాడనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తేజు హెల్త్ పై చేసిన వ్యాఖ్యలు అభిమానులను కంగారు పెట్టే విధంగా ఉన్నాయి.  

click me!