హాట్ థైస్ చూపిస్తున్న లేడీ బాస్... పవన్ హీరోయిన్ ప్రణీత సుభాష్ టెంప్టింగ్ లుక్ వైరల్!

First Published Aug 26, 2022, 11:25 AM IST

హీరోయినే ప్రణీత సుభాష్ అసలు తగ్గడం లేదు. హాట్ థైస్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. లేడీ బాస్ గెటప్ లో కేక పుట్టించారు. ప్రణీత లేటెస్ట్ ఫోటో షూట్ పిచ్చ వైరల్ అవుతుంది.


అమ్మగా ప్రమోషన్ కొట్టేసిన ప్రణీత గ్లామర్ షోలో మరింత జోరు పంచడం విశేషం. 2021 అక్టోబర్ లో సైలెంట్ గా వివాహం చేసుకున్న ప్రణీత సినిమాలు తగ్గించారు. వ్యాపారవేత్త నితిన్ రాజ్ ని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ అమ్మాయికి కూడా జన్మనిచ్చారు. పెళ్ళైన ఏడాది లోపే ప్రణీత తల్లిగా ప్రమోట్ కావడం విశేషం.

ఒక ప్రక్క కెరీర్ చూసుకుంటూనే ప్రణీత కుటుంబాన్ని కూడా చక్కగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ప్రణీత సోషల్ మీడియా ట్రోల్స్ కి గురయ్యారు. భీమన అమావాస్య పురస్కరించుకుని ప్రణీత భర్త పాదాలకు పూజ చేశారు. ఆ పూజకు సంబంధించిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

మోడరన్ డేస్ లో కూడా భర్త కాళ్ళకు మొక్కడాన్ని కొందరు ఫెమినిస్టులు, హేతువాదులు తప్పుబడ్డారు. ఆమెను ట్రోల్ చేయడం జరిగింది. సదరు ట్రోల్స్ కి ప్రణీత ఘాటైన రిప్లై ఇవ్వడం విశేషం. హీరోయిన్ అయినంత మాత్రాన సంప్రదాయాలు వదిలేయాలా? మా కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, పొరుగువారు ఈ పూజ చేశారు. చిన్నప్పటి నుండి ఇవ్వన్నీ చూస్తూ పెరిగాను. భర్త క్షేమం కోసం ఆయనకు పూజ చేస్తే తప్పేముందని ప్రణీత సమర్ధించుకున్నారు. 
 

 పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ భారీ హిట్ కావడంతో ఎన్టీఆర్ తో రభస చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. రభస మాత్రం ఆడలేదు. తెలుగులో ప్రణీత కనిపించిన చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. 
 


ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో చిన్న పాత్రలో ఆమె తళుక్కున మెరిశారు. టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన ప్రణీత హిందీ చిత్రాల్లో నటించడం విశేషం. 2021లో విడుదలైన భుజ్, హంగామ 2 చిత్రాల్లో ప్రణీత నటించారు. 

ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా కన్నడ మూవీ రావణ అవతార చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్ధమైన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ గ్లామరస్ ఫోటో షూట్స్ షురూ చేశారు. తన అంద చందాలతో దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రణీత కెరీర్ ఎలాంటి మలుపులు తిరగనుందో చూడాలి.

click me!