పెళ్లై పిల్లలు ఉన్న హీరోతో ప్రేమాయణం, కెరీర్ ను చేతులారా పాడు చేసుకున్న హీరోయిన్?

హీరోయిన్లు ఏమాత్రం పొరపాటు చేసినా వారి కెరీర్ కు బ్రేకులు వేసుకున్నట్టు. ఈ విషయాన్ని లెక్క చేయకుండా  పెళ్ళైన హీరోతో ఎఫైర్ నడిపిని ఓ బ్యూటీ.. తన కెరీర్ ను చేతులారా పాడు చేసుకుంది. ఇంతకీ ఎవరా టాలీవుడ్ హీరోయిన్? 
 

Nikita Thukral's Career Destroyed After Affair with Married Star Actor Darshan The Untold Story in telugu jms
Nikita Thukral

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా సున్నితంగా ఉంటుంది. ఏమాత్రం పొరపాటు చేసినా అక్కడితో వారి సినిమా జీవితానికి బ్రేక్ లు పడిపోతాయి. స్పీడ్ తగ్గుతుంది, ఇలా చాలామంది హీరోయిన్ల జీవితంలో జరిగింది. ముఖ్యంగా ప్రేమ పెళ్ళి విషయంలో వారు వేసే రాంగ్ స్టెప్ వారి జీవితానికి ఇబ్బంది కరంగా మారుతుంటుంది.

ఇండస్ట్రీకి  కోటికలలతో వస్తుంటారు. కాస్తఫేమ్ రాగానే ఇక అంతా బాగుంది అనుకుంటారు. కాని ఈక్రమంలో వేసే కొన్ని రాంగ్ స్టెప్స్ వారిని పాతాళంలోకి నెడుతుంటాయి. పర్సనల్ లైఫ్ లో వారు తీసుకునే నిర్ణయాలు కెరీర్ పై ప్రభావం చూపిస్తుంటాయి. అలా తన కెరీర్ ను నాశనం చేసుకుంది ఓ హీరోయిన్. 

Also Read: బాలకృష్ణ, విజయ్ దేవరకొండ కు కేఏ పాల్ మాస్ వార్నింగ్, 72 గంటలు టైమ్ ఇచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

Nikita Thukral's Career Destroyed After Affair with Married Star Actor Darshan The Untold Story in telugu jms
Nikita Thukral

పెళ్ళైన హీరోతో ఎఫైర్ నడిపి.. ఇప్పుడు అసలు కనిపించకుండా పోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ ఎవరో కాదు  నిఖితా తుక్రాల్. అవ్వడానికి ఈమె ముంబయ్ హీరోయిన్ అయినా.. ఎక్కువగా  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ  భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది. 

కెరీర్ బిగినింగ్ లో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కాస్త గట్టిగా కష్టపడి ఉంటే స్టార్ హీరోయిన్ కూడా అయ్యేది నిఖిత. కాని ఆమె వేసిన కొన్ని తప్పటడుగులవల్ల ఈ హీరోయిన్ ఎదగలేకపోయింది.చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది నిఖిత.

ఎస్వీ కృష్ణారెడ్డి ఘటోత్కచుడు సినిమాలో కైకాల సత్యనారాయణతో కలిసి నటించింది. ఇక ఆతరువాత ఆర్యన్ రాజేష్ జంటగా హాయ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 

Also Read: షూటింగ్ పూర్తయిన, రిలీజ్ ఆగిపోయిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కెరీర్ లోనే విడుదల అవ్వని ఏకైక మూవీ.


Nikita Thukral

నిఖిత తెలుగులో చాలా సినిమాలు చేసింది. సంబరం, ఖుషిఖుషీగా, కళ్యాణ రాముడు, చింతకాయలరవి, ఇలా చాలా సినిమాల్లో నటించింది. ఇక కన్నడలో స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీ..  ఆల్రెడీ పెళ్లయిన ఒక కో-యాక్టర్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం బయటకు రావడంతో ఫ్యాన్స్‌ కూడా ఆమెపై మండిపడ్డారు. దాంతో ఆమె  ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది. నిఖిత ప్రేమాయణం నడిపించింది ఎవరోతో కాదు. రీసెంట్ గా మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్న కన్నడ స్టార్ హీరో  దర్శన్ తో. 

Also Read: మోహన్ బాబు బదులు, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో, యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?

Nikita Thukral

అతనికి అప్పటికే పెళ్ళైది పిల్లలు ఉన్నారు. అయినా దర్శన్ తో  రిలేషన్ షిప్ ను మెయింటేన్ చేసిందని సమాచారం. ఇద్దరు ప్రేమించుకున్నారని.. సీక్రేట్ ఎఫైర్ నడిపిస్తున్నారని.. అప్పట్లో ఇండస్ట్రీ కోడై కూసింది.   ఈ విషయం అతడి భార్య విజయ లక్ష్మికి తెలిసింది. ఇక అక్కడ నుంచి వరుస వివాదాలు ఆమెను చుట్టు ముట్టాయి. ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పలేదు. 

Also Read: కోటా శ్రీనివాసరావు పర్ఫామెన్స్ తో పిచ్చెక్కించిన సినిమా? ఓవర్ నైట్ స్టార్ ను చేసిన మూవీ ఏదో తెలుసా?

Nikita Thukral

ఇక దర్శన్  భార్య ఈవిషయంతెలిసి ఊరుకోలేదు.. వెంటనే నిఖితతో  తన భర్త వ్యవహారంపై పోలీసులకు కంప్లైయింట్ కూడా చేసింది. దర్శన్ గృహ హింసకు పాల్పడుతున్నాడని  తనపై తుపాకీ చూపి చంపేస్తానని భర్త బెదిరించాడని భార్య ఆరోపించింది.  కేసు వేయడంతో  దర్శన్ అరెస్ట్ కూడా అయ్యారు. దీని తర్వాత సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేగడంతో కన్నడ సినీ నిర్మాతల సంఘం నికితాపై మూడేళ్ల పాటు నిషేధం విధించింది. 

Also Read:రాత్రి 9 తర్వాత కోట్లు ఇచ్చినా, సాయి పల్లవి మాత్రం ఆ పని చేయదని తెలుసా?

Nikita Thukral

కొన్ని నెలల తర్వాత నిషేధం ఎత్తివేయబడినప్పటికీ, అప్పటికి నికితా తుక్రాల్ దర్శకుల దృష్టిలో  వివాదాస్పద నటిగా ముద్ర పడిపోయింది. దాంతో ఆమెకు అవకాశాలు రాలేదు.  సినిమా రంగానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. తరువాత, నటి 2017 లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను వివాహం చేసుకుంది. సినిమా ప్రపంచానికి పూర్తిగా దూరమైన నికిత.. ఇప్పుడు ఓ కూతురికి తల్లి,  కొన్ని సీరియల్స్ లో కనిపించిన నిఖిత.. ప్రస్తుతం సోసల్ మీడియాలో సందడి చేస్తూ.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. 

Also Read:నయనతార తమ్ముడిగా పాన్ ఇండియా స్టార్ హీరో, సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన మేకర్స్

Latest Videos

vuukle one pixel image
click me!