సూపర్ స్టార్ ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని వదులుకున్నాడు. ఆ మూవీ చేసిన మరో హీరో ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్నాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత వరుస విజయాలతో సూపర్ స్టార్ అయ్యారు. అట్నుంచి మెగాస్టార్ అయ్యారు.
ఆయనే చిరంజీవి. కృష్ణ వదులుకున్నమూవీ `ఖైదీ`. 1983లో వచ్చిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీని ధనుంజయ రెడ్డి, నరసా రెడ్డి, ఎస్ సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
ఇందులో చిరంజీవికి జోడీగా మాధవి హీరోయిన్‌గా నటించింది. రావు గోపాల్ రావు విలన్‌గా నటించారు. సుమలత, నూతన్ ప్రసాద్, రాళ్లపల్లి, రంగనాథ్, చలపతి రావు కీలక పాత్రలు పోషించారు.