అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. అనుకోకుండా.. అనూహ్యంగా హీరో అయ్యి.. కెరీర్ ను ఒక పద్దతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. హీరో నాని. సహజమైన నటనతో.. నేచురల్ స్టార్ అన్న బిరుదు కూడా సంపాదించాడు నాని. టాలీవుడ్ లో స్వతహాగా ఎదిగిన హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. ..మన పక్కింటి కుర్రాడిలా.. మన ఇంట్లో మామలా.. బ్యాచిలర్ బాబాయిలా ఉంటాడు నాని. అంతే కాదు లేడీస్ లో కూడా నాని క్రేజ్ అంతా ఇంతా కాదు.