టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ చిరంజీవిది. మెగా ఫ్యామిలీ నుండి ఏకంగా అరడజనుకు పైగా ఉన్నారు. చిరంజీవి స్థాపించిన మెగా సామ్రాజ్యంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్ హీరోలుగా ఎదిగారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ టైర్ టు హీరోల లిస్ట్ లో ఉన్నారు.
Chiranjeevi
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ టాలీవుడ్ ని ఏలుతున్న రోజుల్లో చిరంజీవి నేనున్నాను అంటూ రేసులోకి దూసుకు వచ్చాడు. చిరంజీవికి ప్రత్యేకంగా మార్చిన విషయాల్లో డాన్స్ ఒకటి. హీరోగా కావాలని గట్టిగా ఫిక్స్ అయిన చిరంజీవి నటనతో పాటు డాన్స్ లో కూడా శిక్షణ తీసుకున్నాడు. చిరంజీవికి భరత నాట్యంలో ప్రావీణ్యత ఉంది. అది ఆయనను హీరోగా గొప్ప డాన్సర్ ని చేసింది.
Chiranjeevi
చిరంజీవి డాన్సులలోని గ్రేస్ మరొక హీరోకి రాలేదు. చిరంజీవి తర్వాత గొప్ప డాన్సర్స్ ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది. వీరిద్దరి డాన్సులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. విపరీతంగా కనెక్ట్ అయ్యారు. 2007లో చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అప్పటికే హీరోలుగా నిలదొక్కుకున్నారు.
అయితే చిరంజీవి గతంలో రామ్ చరణ్ విషయంలో భాధపడేవాడట. అందుకు కారణం ఏమిటంటే... చిరంజీవి కుటుంబంలో ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా అల్లు అర్జున్ చాలా యాక్టీవ్ గా ఉండేవాడట. చిరంజీవి పాటలకు డాన్స్ అదరగొట్టేవాడట. దాంతో చిరంజీవి మురిసిపోయేవాడట. కానీ రామ్ చరణ్ పెద్దగా డాన్స్ వేసేవాడు కాదట. దాంతో చిరంజీవి ఆందోళన చెందేవాడట.
చిరంజీవి అంటే డాన్స్ లకు ఫేమస్. ఆయన కొడుకు కనీసం ఓ మోస్తరు డాన్సర్ కాదంటే పరువు పోతుంది. రామ్ చరణ్ నా పరువు తీస్తాడేమో అనుకునేవాడట. డాన్స్ ల విషయంలో అల్లు అర్జున్ ని చూసి నేర్చుకో అనేవాడట. చిరుత మూవీలో రామ్ చరణ్ డాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల తర్వాత రామ్ చరణ్ మాత్రమే. వీరిలా ప్రొఫెషనల్ గా డాన్స్ చేసే హీరోలు లేరు.