గతంలో హీరో శర్వానంద్ అఖిల్ తో పాటు అమలను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మీకు ఫెవరేట్ ఫుడ్ ఏదీ అని అడిగితే.. అఖిల్ తో పాటు అమల కూడా ఐస్ క్రీమ్ అని చెప్పింది. దాంతో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఐస్ క్రీమ్ లు తిని బ్రతికేస్తున్నారా అని శర్వానంద్ జోక్ చేశారు కూడా.
ఇలా నాగార్జున ఇంట్లో ఐస్ క్రీమ్ కు అంత ప్రత్యేకత ఉంది. ఇక 65 ఏళ్ళ వయస్సులో కూడా దూసుకుపోతున్నారు నాగార్జున. అదే ఫిట్ నెస్ తో హ్యాండ్సమ్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం హీరోగా వరుస ఫెయిల్యూర్స్ చూస్తున్న నాగార్జున క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ధనుష్ కుభేర మూవీతో పాటు.. రజినీకాంత్ కూలి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.