Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu
Pushpa 2: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2: ది రూల్’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమా థియేటర్‌లలో రికార్డులు నెలకొల్పి భాక్సాఫీస్ దగ్గ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
భారీ విజయాన్ని అందుకున్న ‘పుష్ప 2’ (Pushpa 2) జనవరి 30న నెట్‌ఫ్లిక్స్ ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చిన వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లోనూ రికార్డు సృష్టించింది. అయితే ఆ తర్వాత డ్రాప్ అయ్యింది.
24
Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu
Pushpa 2: వాస్తవానికి నెట్ ప్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన నాటినుంచి వ్యూస్ పరంగా టాప్‌లో ఉన్న ‘పుష్ప 2’ తాజాగా ఏడు దేశాల్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) రెండో స్థానంలో నిలిచింది.
ఇది తెలుగు సినిమాకు దక్కిన అరుదైన ఘనత అని అభిమానులు అంటున్నారు. ఈ వ్యూస్ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుకునే లోగా తగ్గిపోవటం మొదలైంది(Pushpa 2 OTT Record).రెండు వారాల అయ్యేసరికి నెట్ ప్లిక్స్ ట్రెండింగ్ లేకుండా తప్పుకుంది.
34
Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu
Pushpa 2: ‘పుష్ప 2’నాలుగు వారంలోకి (పిభ్రవరి 16 – పిభ్రవరి 23 )లోకి ప్రవేశించేసరికి టాప్ 10 గ్లోబెల్ నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ లిస్ట్ లో లేదు. రీసెంట్ గా వచ్చిన ఇండియన్ చిత్రాలు ధూమ్ థామ్ (రెండవ వారం), డాకూ మహారాజ్ (మొదటి వారం) టాప్ 10 గ్లోబుల్ లిస్ట్ లోకి చేరాయి.
ఇండియాలో డాకూ మహారాజ్ చిత్రం ఈ వారం నాలుగువ ప్లేస్ లో ఉంది ట్రెండ్ అవుతోంది. పాకిస్దాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, ఇండియాలలో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. అయితే ఈ క్రమంలో పుష్ప 2 ప్రక్కకు వెళ్లటం మాత్రం ఎవరూ ఊహించలేదు.
44
Pushpa 2 Struggles in OTT: Fails to Trend on Netflix? in telugu
Pushpa 2:పుష్ప 2 సినిమా నార్త్ లో ఓటిటిలో ఎక్కువ మంది చూడకపోవటానికి కారణం..ఆల్రెడీ ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ అవటమే అంటున్నరు. అలాగే మొదట 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప 2’కు అదనంగా ఇటీవల మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు.
దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది. ఇక ఓటీటీ వెర్షన్ కూడా ఇదే నిడివితో అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాని చాలా పెద్దదిగా ఫీలై ఇతర దేశాల్లో స్కిప్ చేస్తున్నట్లు సోషల్ మీడియా డిస్కషన్స్ లో తేలుతోంది.