దాదాపు 50 ఏళ్ళుగా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న స్టార్ సింగర్ కే.జే. ఏసుదాస్ అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కే.జే. ఏసుదాస్ పరిస్థితి ఎలా ఉంది?
కేరళకు చెందిన కే.జే. ఏసుదాస్ స్టార్ సింగర్ గా సంగీత ప్రపంచాన్ని ఏలారు. తన ప్రత్యేకమైన గొంతుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మలయాళం తో పాటుగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు.
25
నాన్న ద్వారా సంగీతంపై ఆసక్తి:
ఏసుదాస్ తండ్రి సంగీత కళాకారుడు కావడంతో చిన్న వయసులోనే ఆయనకు సంగీతంపై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత హిందుస్తానీ సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. 1962లో విడుదలైన మలయాళ చిత్రం 'కాల్పాదుకల్' ద్వారా ఏసుదాస్ నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి తిరిగి చూసుకోలేదు. ఎన్ని పాటలు పాడారు. ఏ భాషలో పాడారు అనేది లెక్కే లేదు.
35
తెలుగు, తమిళం
మొదటి చిత్రంలోనే ఆయన పాడిన పాట, ఆయన గొంతు శైలి అభిమానులను ఆకట్టుకోవడంతో.. ఆ తర్వాత ఆయనకు చాలా మలయాళ వరుసగా అవకాశాలు వచ్చాయి. . ఆ తర్వాత చిన్నగా తెలుగు, తమిళ భాషల్లోకి కూడా ఎంటర్ అయ్యారు ఏసుదాసు. ఈ రెండు భాషల్లో కూడా వందల పాటలను ఆలపించారు. ఏసుదాసు గొంతుకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. మరీ ముఖ్యంగా మెహన్ బాబు లాంటి హీరోలు ఆయనతో తమ సినిమాల్లో ఒక్క పాట అయినా పాడించుకునేవారు.
45
ఏసుదాస్ 7
ఏసుదాస్ తెలుగు,తమిళంలో 1500కు పైగా పాటలు పాడారు. చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు, వెంకటేష్ తమిళంలో ఎంజీఆర్, శివాజీ, రజనీకాంత్, కమల్, అజిత్, విజయ్ ఇలా దాదాపు 5 తరాల నటులకు కేజే ఏసుదాస్ పాటలు పాడారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు విజయ్ ఏసుదాస్ కూడా ప్రముఖ గాయకుడిగా ఉన్నారు.
55
కేజే ఏసుదాస్ కు అనారోగ్యం
ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గురించి వస్తున్న సమాచారం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. 85 ఏళ్ల వయసున్న ఆయనకు ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించడంతో కేజే ఏసుదాస్‌ను ఆసుపత్రిలో చేర్చారని, ఆయనకు రక్త కణాలకు సంబంధించిన సమస్య ఉందని వైద్యులు చికిత్స అందిస్తున్నారని వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో అభిమానులు, ప్రముఖులు ఏసుదాస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.