Naga Chaitanya: మొదట్లో చాలా విసిగిపోయా..సమంతతో విడాకులపై చైతూ షాకింగ్ కామెంట్స్..

Published : Aug 06, 2022, 06:48 AM IST

నాలుగేళ్లు టాలీవుడ్‌లో ఓ ఆదర్శ జంటగా పేరుతెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఊహించని విధంగా విడిపోయి అభిమానులకు షాకిచ్చారు. అయితే ఇటీవల దీనిపై నాగచైతన్య ఓపెన్‌ అవుతున్నాడు. అందులో భాగంగా లేటెస్ట్ గా ఆయనొక షాకింగ్‌ కామెంట్ చేశారు.   

PREV
15
Naga Chaitanya: మొదట్లో చాలా విసిగిపోయా..సమంతతో విడాకులపై చైతూ షాకింగ్ కామెంట్స్..

నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల సమంత(Samantha)తో విడాకులపై ఓపెన్‌ అవుతున్నారు. మొదట్లో దీనిపై సైలెంట్‌గా ఉన్న వీరిద్దరు, ఇప్పుడు ఏమాత్రం అవకాశం దొరికినా పాజిటివ్‌,నెగటివ్‌ ఏదో విధంగా స్పందిస్తున్నారు. ఆశ్చర్యకర విషయాలను వెల్లడిస్తున్నారు. లేటెస్ట్ గా చైతూ మరోసారి సమంతతో విడాకులపై స్పందించారు. ఓ బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ, మొదట్లో విసుగు వచ్చిందంటూ షాకిచ్చారు. 
 

25

మరి ఆయనకు విసుగు పుట్టించిందేంటి? అనేది చూస్తే, సమంతతో విడిపోయినప్పుడు మొదట్లో తమపై వచ్చిన కథనాలు చూసి విసుగు చెందానని తెలిపారు. సమంతపై ఇప్పటికీ తనకు గౌరవం ఉందని చెప్పారు. ఆ గౌరవం ఎప్పటికీ పోదని, విడాకులు ఇద్దరి అండర్‌స్టాండింగ్‌తోనే జరిగిందని తెలిపారు. ఆ టైమ్‌లో కూడా ఒకరిపై ఒకరికి రెస్పెక్ట్ ఉందని చెప్పారు నాగచైతన్య. అయితే మా మధ్య ఇంకా ఏదో ఉందని, ఇంకేదో చెప్పేందుకు బయటజనం ప్రయత్నిస్తున్నారు. అదే విచిత్రంగా అనిపిస్తుందని తెలిపారు. 

35

డైవర్స్ తర్వాత పరిణామాలపై ఆయన స్పందిస్తూ వ్యక్తిగత జీవితానికి, వృతి పరమైన జీవితానికి మధ్య ఓ స్పష్టమైన లైన్‌ గీయాలని, అప్పుడే ప్రశాంతంగా ఉండగలమని, రెండింటిని ఎట్టిపరిస్థితుల్లోనూ కలపొద్దని పేర్కొన్నారు నాగచైతన్య. కమిట్‌మెంట్‌తో చేసే పని మనల్ని ఎప్పుడూ గెలిపిస్తుందన్నారు. పుకార్లని పట్టించుకోవద్దని, వార్తలకు వార్తలే సమాధానం అని వెల్లడించారు. ఇవాళ ఒకటి వస్తే, రేపు మరోకటి వస్తుంది. కాబట్టి వాటిని పట్టించుకోకుండా మనం ఏం చేయాలనుకున్నామో దానిపై ఫోకస్‌ పెడుతూ ముందుకు సాగాలని తెలిపారు నాగచైతన్య. 

45

ప్రస్తుతం నాగచైతన్య.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `లాల్‌ సింగ్‌ చడ్డా` (Lal Singh Chaddha) చిత్రంలో నటించారు. అమీర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన చిత్రమిది. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులో దీన్ని చిరంజీవి సమర్పిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా ఈ సినిమాపై బజ్‌ ఏర్పడింది. ఈ చిత్రంలో బాలరాజు పాత్రలో కనిపించబోతున్నారు చైతూ. అందుకు తాత ఏఎన్నార్‌ ని ఇన్‌స్పైర్‌గా తీసుకోవడం విశేషం. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇలాంటి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు చైతూ.
 

55
Image: Official film poster

ఇదిలా ఉంటే ఇటీవల నాగచైతన్య `థ్యాంక్యూ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ చిత్రం ఘోర పరాజయం చెందింది. ప్రస్తుతం ఆయన వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `దూత` అనే ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తున్నారు. దీనికి విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించడం విశేషం. మరికొన్ని ప్రాజెక్ట్ లకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories