థండర్ థైస్ తో మెరుపులు, నాజూకైన హిట్ బ్యూటీ వయ్యారాల వెల్లువ.. మీనాక్షి మోడ్రన్ లుక్ కి నెటిజన్లు ఫిదా

First Published Jan 27, 2023, 6:50 AM IST

హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. 

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివిశేష్ కి జంటగా మీనాక్షి నటించింది. 

రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హిట్ 2 విజయం సాధించింది కాబట్టి ఇకపై మీనాక్షి బిజీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి. 

హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. కుర్రాళ్ళని తన వైపు తిప్పుకుంది. 

తాజాగా మీనాక్షి చేసిన ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వేడెక్కించే అందాలతో మీనాక్షి చెలరేగిపోయిన విధానం అందరికి షాకింగ్ గా మారింది. థైస్ అందాలు కనిపించేలా ఉన్న షార్ట్ డ్రెస్ లో ఆమె వయ్యారంగా నిలబడి ఇస్తున్న ఫోజులు గ్లామర్ ప్రియులకు కనువిందుగా మారాయి. 

మీనాక్షి గ్లామర్ విధ్వంసానికి కుర్రాళ్లు విలవిల లాడుతున్నారు అనే చెప్పాలి. ఈ ఫోజుల్లో మీనాక్షిని కుర్రాళ్లు చూస్తే హృదయాలు గల్లంతవుతాయి. నెటిజన్లు మీనాక్షి ఫోజులపై కామెంట్స్ చేస్తున్నారు. 

ఆమె షేపులకు ప్రేమలో పడుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మీనాక్షి చౌదరి అనేక బ్యూటీ పెజెంట్ వేదికలపై విన్నర్ గా నిలిచింది. ఆమె అందం అలాంటిది మరి.

click me!