అయితే ఈ స్థలం.. ఆ పెద్ద విలాసవంతమైన బంగ్లా చుట్టునే వివాదం రాజుకుంది అని సమాచారం. ఆస్తుల పంపకాలు జరిగితే ఈ ప్లేస్, ఆబంగ్లా తరకు కావాలి అంటున్నాడట మనోజ్. కాని మనోజ్ రెండో పెళ్లి.. భూమా మౌనిక అంటే నచ్చని మోహన్ బాబు, విష్ణు.. ఈ బంగ్లాను ఇవ్వడానికి నిరాకరించినట్టు సమాచారం. అంతే కాదు వీరి పెళ్ళి జరిగినప్పటి నుంచి ఈ వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది.
మౌనిక మొదడి భర్తకు కలిగినతనయుడు మనోజ్ తో ఉండటం కూడా మంచు ఫ్యామిలీకి ఇష్టంలేదని తెలుస్తోంది. ఇక మంచువారి విద్యాసంస్థలు, విష్ణు దుబాయ్ వ్యాపారాలకుసబంధించిన విషయాలు బయటపెడతానని మనోజ్ అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియో ప్రకారం మనోజ్, అతని భార్య మౌనిక కలిసి తాగి ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారని. పనివాళ్లను కొడుతున్నారని, ఆస్తి కోసం అన్న విష్ణును చంపుతానని బెధిరించాడని, రోజంతా తాగుతూ గొడవ చేస్తున్నాడని మోహన్ బాబు వర్షన్.