కన్నడ వాళ్లు మాత్రం రెండు సినిమాలతో పాన్ఇండియాను ఇంప్రెస్ చేయగలిగారు. కెజియఫ్ తో పాటు కాంతార సినిమాలు కన్నడ సినిమాకు దేశ వ్యాప్తం గుర్తింపు తీసుకువచ్చాయి. ఇది పక్కన పెడితే తమిళ సినిమాలు మాత్రం ఎంత ప్రయత్నం చేస్తున్నా.. పాన్ ఇండియా స్ధాయిని అందుకోలేకపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశారు తమిళ హీరోలు.
తాజాగా సూర్య కూడా ఇదే ప్రయత్నం చేశాడు. మంచి మంచి కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేస్తూ వస్తున్న సూర్య. అదే కాన్సెప్ట్ తో.. భారీ బడ్జెట్ ను జోడించి.. కంగువ అనే అద్భుతమైన సినిమా చేశాడు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని నమ్మారు. నిర్మాత అయితే వెయ్యి కాదు ఏకంగా 2000 కోట్ల కలెక్షన్స్ సాధించినా ఆశ్చర్యపోవలసరం లేదు అన్నారు.