నాజూకు నడుము విల్లులా వంచిన కీర్తి సురేష్... మతి పోగొడుతున్న యోగా భంగిమలు!

First Published Jun 4, 2021, 12:49 PM IST


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నారు. మహానటి సినిమాతో కీర్తి దశ తిరగగా భాషాబేధం లేకుండా అన్ని పరిశ్రమలను దున్నేస్తున్నారు. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. 
 

తెలుగు, తమిళ్, మలయాళ బాషలలో కలిపి కీర్తి చేతిలో అరడజను సినిమాల వరకు ఉన్నాయి. అయితే తెలుగులో ఆమె నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం మరింత ప్రత్యేకం. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న ఈ మూవీ భారీ ఎత్తున తెరకెక్కుతుంది.  సర్కారు వారి పాట షూటింగ్ ఇప్పటికే మొదలైంది.
undefined
అలాగే మలయాళంలో మోహన్ లాల్ కి జంటగా ఓ పీరియాడిక్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల కానుంది.
undefined
ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండాలంటే నాజూకు శరీరం, మెరిసే మేని ఛాయ అవసరం. అందుకే హీరోయిన్స్ కడుపు మాడ్చుకొని, కఠిన కసరత్తులు చేసి ఆకర్షించే శరీరాకృతి మైంటైన్ చేస్తారు. ఈ సూత్రాన్ని కీర్తి కూడా అమలు చేస్తుంది.
undefined
ఒకప్పుడు బొద్దుగా ఉండే కీర్తి సురేష్ చాలా సన్నబడ్డాడు. మహానటి చిత్రానికి ముందు తన ఎత్తుకు తగిన బరువుతో కొంచెం బొద్దుగా ఉండేవారు. అయితే మహానటిలో సావిత్రి పాత్ర కోసం కీర్తి కొంచెం బరువు పెరిగారు.
undefined
పెరిగిన ఆ బరువు తగ్గించే క్రమంలో ఆమె చాలా సన్నగా తయారయ్యారు. మునుపటి కీర్తి సురేష్ ఫిగర్ కి ప్రస్తుతం ఆమె కనిపిస్తున్న తీరుకు అసలు సంబంధం లేదు. కఠిన కసరత్తులు, యోగాసనాలు చేసి కీర్తి సన్నగా నాజూకుగా మారారు.
undefined
సన్నబడిన కీర్తి శరీరంపై ఫ్యాన్స్ మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సూపర్ అంటుంటే మరికొందరు బొద్దుగా ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడు కళ కోల్పోయింది అని విమర్శిస్తున్నారు.
undefined
ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కెరీర్ కోసం, ఆరోగ్యం కోసం కీర్తి సురేష్ బరువు తగ్గడం జరిగింది. కాగా కీర్తి యోగా భంగిమలకు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఉంటారు. దీంతో ఆమె యోగాసనాలు, కసత్తులకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
తాజాగా కీర్తి యోగాసనాలు చేస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. కీర్తి యోగా భంగిమలకు సంబంధించిన ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
undefined
click me!