2020లో విడుదలైన ఫోటో గురించి మాట్లాడుతూ, షూటింగ్ దృశ్యాలను అనుమతి లేకుండా వాడినప్పుడే దావాకు కారణం ఏర్పడిందని, అంటే కాపీరైట్ ఉల్లంఘన జరిగినప్పుడేనని రామన్ వాదించారు. డాక్యుమెంటరీ విడుదలైన తర్వాతే వాడిన దృశ్యాల గురించి తెలిసిందని, అందుకే డాక్యుమెంటరీ విడుదలయ్యే వరకు దావా వేయలేదని అన్నారు.
ఆ దృశ్యాలను వాడకుండా ఉండాలని ప్రతివాదులకు ఈమెయిల్ పంపామని ఆయన కోర్టుకు తెలిపారు. దీంతో కేసు విచారణను తేదీ ప్రకటించకుండా వాయిదా వేశారు.ఇదిలా ఉండగా, దనుష్ చెన్నై హైకోర్టులో దావా వేయడానికి వీల్లేదని, ఆ కేసును కొట్టివేయాలని నెట్‌ఫ్లిక్స్ కోర్టును ఆశ్రయించింది. దీన్ని తోసిపుచ్చిన కోర్టు, నెట్‌ఫ్లిక్స్ దావాను కొట్టివేసింది.
Also Read: 50 ఏళ్ళు దాటినా శోభన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?