దుమ్మురేపే కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 5 షెడ్యూల్  ఇదే?

First Published Jun 16, 2021, 4:48 PM IST


సామాన్యులను సెలబ్రిటీలను చేయగల సత్తా బిగ్ బాస్ షోకి ఉంది. బిగ్ బాస్ సీజన్ 4 ఇది నిరూపించింది కూడా. కోవిడ్ ఆంక్షల కారణంగా సెలెబ్రిటీలు ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు. దీనితో అఖిల్, సోహైల్, అరియాన, దివి లాంటి వారిని పంపించారు. 

వారు గతంలో కొన్ని సీరియల్స్, సినిమాలు చేసినా ప్రజలకు వాళ్ళ పేర్లు పెద్దగా తెలియవు. అయిత్ షో నుండి బయటికి వచ్చాక వాళ్ళందరూ సెలెబ్రిటీలు అయ్యారు. మంచి అవకాశాలు దక్కించుకొని కెరీర్ లో పైకి వెళ్లే ప్రణాళికలలో ఉన్నారు.
undefined
ఇక బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజీత్ నిలిచాడు. టైటిల్ కోసం అఖిల్ తో పోటీపడి అత్యధిక ఓట్లు సాధించి బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అయ్యారు. ఇక నాగార్జున సారథ్యంలో సాగిన బిగ్ బాస్ సీజన్ 4 ప్రతికూలతల మధ్య కూడా భారీ విజయాన్ని అందుకుంది.
undefined
దీనితో నయా సీజన్ కోసం స్టార్ యాజమాన్యం సిద్ధం అవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 5కి సర్వం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
undefined
ఇక జూన్, జులై లోనే బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభించాలని నిర్వాహకులు భావించారు. కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఈసారి కూడా ఆలస్యం కానుంది.
undefined
సీజన్ 5 కోసం కంటెస్టెంట్స్ ఎంపిక, నిర్వహణ వంటి విషయాలపై ఇప్పటికే ప్రణాళికలు మొదలైపోయాయి. అయితే షో మాత్రం సెప్టెంబర్ లో మొదలవుతుందని సమాచారం. కంటెస్టెంట్స్ ఎంపిక అనంతరం వారిని క్వారంటైన్ కి పంపాలి, కాబట్టి ఈ సీజన్ కూడా కొంచెం ఆలస్యం కానుందట.
undefined
గత సీజన్ మాదిరి కాకుండా కొంచెం పరిచయం ఉన్న సెలెబ్రిటీలు హౌస్ లోకి పంపాలనేది స్టార్ మా ఆలోచనగా తెలుస్తుంది. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, టిక్ టాక్ స్టార్ దుర్గారావ్, యాంకర్ రవితో పాటు మరికొందరు బుల్లితెర సెలెబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి.
undefined
ఇక పాయల్ రాజ్ పుత్, భూమిక వంటి హీరోయిన్స్ పేర్లు కూడా ప్రచారం కాగా వారు ఖండించారు. ఏది ఏమైనా గత సీజన్స్ కి మించి సరికొత్తగా సీజన్ 5 సిద్ధం కానుందని సమాచారం. ఇక వరుసగా మూడోసారి నాగార్జున రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.
undefined
click me!