Intinti Gruhalakshmi: తులసిపైన అనసూయకు చాడీలు చెప్పిన లాస్య.. భర్త పోస్ట్ కే ఎసరు పెట్టిన లాస్య!

First Published Oct 17, 2022, 10:35 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..దివ్య తులసి దగ్గరికి వెళ్లి, అమ్మ నేను నీకు ఏమైనా సహాయం చేయాలా, నువ్వు ఏం చెప్పినా చేస్తాను అని అంటుంది. దానికి తులసి,నువ్వు నాకు ఏం సహాయం చేయొద్దు నా పనులు చెడగొట్టకుండా ఉంటే చాలు అని అంటుంది. దానికి దివ్య, నీకు నాకన్నా నీ కోడళ్లు ఎక్కువైపోయారు కదా నాకేం పనులు చెప్పడం లేదు అయినా ఈరోజు నీ కోడల్ని నీకు ఎలా సహాయం చేస్తారో నేను చూస్తాను అని అనగా వాళ్ళు ఎందుకు నాకు సహాయం చేయరు అని తులసి అంటుంది. నిన్న రాత్రి నువ్వు నేనే కదా వాళ్ళని తయారు చేసి గదిలోకి పంపాము ఇంత ఉదయాన్నే లెగుస్తారని నువ్వు అనుకుంటున్నావా అని అంటుంది దివ్య. అదే సమయంలో అంకిత అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తుంది.శోభనం తర్వాత రోజు ఇంత ఉదయం లేగడం ఏ సినిమాలోని చూపించలేదు. అయినా హీరోయిన్ లెగుస్తే హీరో మళ్లీ ఆపేస్తాడు కదా అని దివ్య అనగా అంకిత, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడటం నేర్చుకోవే అయినా నాకన్నా ముందు హీరో గారే లెగిచి ఎదో కేసు ఉన్నదని హాస్పిటల్ కి వెళ్ళారు అని అంకిత అంటుంది.

ఆ తర్వాత సీన్లో ప్రేమ్, శృతిలు గది తలుపు తీసి ఎవరూ లేనప్పుడు బయటకు వస్తూ ఉండగాప్రేమ్,శృతి తో ముందుగా చూసుకోవే తాతయ్య కి దొరకకుండా ఉంటే చాలు అని అంటాడు. ఎందుకు అని శృతి అడగగా, నీకు తెలియదే ఆయన సిద్ధాంతాలు అన్ని నా మీద రుద్దుతున్నాడు థియేటర్ బయటకి వచ్చి రెస్పాన్స్ అడిగినట్టు ఇప్పుడు జరిగినదంతా నాకు సీరియల్ చెప్పమంటాడు. ఏదైనా తప్పుగా అయితే మూడో ఫస్ట్ నైట్ కూడా పెట్టేస్తాడు, సీసీ కెమెరాలా తయారవుతున్నాడు అని అనగా,అదే సమయంలో పరంధామయ్య అక్కడికి వస్తాడు.అంతా వినేశావా తాతయ్య అని అనగా, పూసగుచ్చినట్టు విన్నాను బట్టీ పట్టమంటావా! నన్ను సీసీ కెమెరా అంటావా నీ పని చెప్తా నాకు రా అని అనసూయని పిలిపించి ఒక ప్లేట్ నిండా స్వీట్లు తీసుకుని ప్రేమ్ కి ఇస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అనగా నాకు శుభవార్త వచ్చేవరకు నువ్వు తినాలి ఇంట్లోనే ఉండాలి అని అంటాడు. నన్ను వదిలేయండి రా బాబు అనుకొని ప్రేమ్ పరిగెట్టుకుంటూ ఇంటి బయటకు వెళ్ళిపోతాడు. ప్రేమ్ ని చూసి అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత సీన్లో లాస్య పదేపదే అనసూయ కి ఫోన్ చేస్తూ ఉంటుంది.
 

ఇది ఎందుకు నాకు చేస్తుంది అని అనసూయ అనుకోని ఫోన్ ఎత్తుతుంది. అప్పుడు లాస్య, అత్తయ్య గారు ఇక్కడ ఘోరం జరిగిపోయింది మేము ఎవరికీ ఏ ద్రోహం చేసేమని మా పని మేము చేసుకుంటూ ఉన్నాం కదా అయినా చెడు కళ్ళు మా మీద పడుతున్నాయి.మొన్న అయిన గొడవ వల్ల తులసి కోపంతో నందూని ఉద్యోగం మానిపించేలా చేసింది. నందు ఉద్యోగం మానేసాడు అని అంటుంది. దానికి అనసూయ ఆ రోజు గొడవలో మీరేం చేశారని మిమ్మల్ని అనడానికి అని అనగా, అదే కదా మేము అంత మౌనంగా ఉన్నాము మీ మీద కోపం మా మీద చూపిస్తుంది అని అంటుంది లాస్య.దానికి అనసూయ, అయినా సామ్రాట్ ఉద్యోగంలో నుంచి పీకేసాడా లేక నందు ఏ మానేసాడా అని అనగా, నచ్చిన పని చేయక పోతే పనిమనిషి మానేస్తాది. అంత నీచంగా మాట్లాడితే మరి నందు మానేయకుండా ఉంటాడా నన్ను మానేయమన్నాడు కానీ పూట గడవడం కోసం పని చేస్తున్నాను ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీతో ఈ బాధ చెప్పుకుంటున్నాను అత్తయ్య మీరు ఇప్పుడు కోపంతో వెళ్లి తులసిని అడగొద్దు అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు అనసూయ మనసులో, ఇంత జరిగినా తులసి నాకు చెప్పలేదు తను ప్రవర్తన మారుతుంది అని అనుకుంటుంది.
 

 అదే సమయంలో తులసి అక్కడికి వచ్చి, అత్తయ్య నాకు చిన్న పని ఉన్నది ఆఫీస్ కి వెళ్తున్నాను అని అనగా ఎందుకమ్మా ప్రతి దగ్గర నా పర్మిషన్ తీసుకుంటున్నావు బయట వాళ్ళు ఎవరైనా చూస్తే నేను నిన్ను అదుపులో పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారు. అయినా ఇదెందుకు కొత్తగా అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య గారికి నా మీద ఎప్పుడూ మనస్ఫత్తులు తొలుగుతాయో,ఎప్పుడు ఒకటవుతామో అని అనుకొని వెళ్ళిపోతుంది తులసి. తులసి వెళ్లిపోవడం చూసిన అనసూయ,తులసి పూర్తిగా మారిపోయినట్టేనా చేజారిపోయినట్లే అనుకుంటుంది.అనసూయ అలా ఉండడం చూసిన అభి, అక్కడికి వచ్చి నానమ్మ ఏమైంది ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడే నువ్వు ఇంత మౌనంగా ఉన్నావంటే దానికి కారణం ఏంటి అని అడగగా, జరిగిన విషయం అంతా అనసూయ చెప్తుంది. అప్పుడు అభి, నువ్వు వెళ్లి అమ్మని నిలదీయొచ్చు కదా నానమ్మ అని అడగగా మొన్న నిడదీసి నందుకే తులసి ఇంత మొండిదైంది మళ్ళి ఇంట్లో నా వల్ల గొడవలు రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.ఆ తర్వాత సీన్లో సామ్రాట్ పరంధామయ్య కి ఫోన్ చేసి మీరు చెప్పిన పని అయిపోయింది అని అనగా హమ్మయ్య మంచి పని చేశారు.

 రేపు పండుగ తులసికి మంచి సప్రైజ్ ఇవ్వాలి అని అంటాడు పరంధామయ్య. ఇంత మంచి పని నా చేత చేయిస్తున్నందుకు ధన్యవాదాలు. తులసి గారికి మీలాంటి మామగారు రాయడం తన అదృష్టం అని అనగా, లేదా బాబు దురదృష్టం ఈ వయసులో తను హాయిగా సుఖపడుతూ ఉండడం మానేసి ఇలా కష్టపడుతుందంటే అది నా కొడుకు వల్లే నేను ఆ తప్పును తీర్చిదిద్దుకుంటాను అని అంటాడు. ఆ తర్వాత వాళ్లు ఫోన్ పెట్టేసినప్పుడు సామ్రాట్ తులసిని చూస్తూ ఒక మంచి మనిషి ఆనందానికి మనం కారణమవుతున్నప్పుడు అది ఎంతో ఆనందంగా ఉంటుంది అని అనుకుంటాడుఅప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి, ఆనందంగానే ఉంటుంది. పరంధామయ్య గారు ఫోన్ చేశారు నువ్వు సహాయం చేసావు ఇంత సంతోషపడుతున్నావు. నీ బుర్రకి ఇంకెప్పుడు ఎలుగుతుందో అర్థం కావడం లేదు అని అనగా ఒక ఫ్రెండ్ కి హెల్ప్ చేసే అవకాశం దొరికింది అని నేను ఇలా ఉన్నాను బాబాయ్ లేనిపోనివి ఊహించుకోవద్దు అని అంటాడు.మరోవైపు లాస్య ఏవో ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ, ఈ ఐడియాలు సామ్రాట్ గారికి చెప్తే నందు లేడని కోప్పడకుండా జనరల్ మేనేజర్ పోస్ట్ కి నేనే అర్హురాలు అని చెప్పి సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది లాస్య.
 

 అప్పుడు సామ్రాట్,నువ్వు నెక్స్ట్ టైం నుంచి నా దగ్గరికి వస్తున్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకో లాస్య అలాగే లోపలికి వచ్చినప్పుడు డోర్ కూడా లాక్ చేసి రా అని అనగా, కొత్తగా రూల్స్ చెప్తున్నాడు ఏంటి అని లాస్య అనుకోని, ఓకే సార్ అని అంటుంది. ఇప్పుడు విషయం ఏంటో చెప్పు అని సామ్రాట్ అనగా ప్రాజెక్ట్ గురించి లాస్య ఏవో చెప్తూ ఉంటుంది.అప్పుడు సామ్రాట్, అయినా ఇవన్నీ నువ్వెందుకు చెప్తున్నావు నంద గోపాల్ ఎక్కడ పిలు అని అనగా రాలేదు సార్ అని లాస్య అంటుంది. ఈరోజు ముఖ్యమైన మీటింగ్ కదా ఒకవేళ రాకపోయినా చెప్పాలి కదా అని అనగా, ఉద్యోగం మానేశాడు సార్ అని లాస్య అంటుంది.
 

దానికి సామ్రాట్ ఆశ్చర్యపోయి,మనుషుల మీద నమ్మకం ఎందుకే పోతుంది ఉద్యోగం కావాలి అన్నప్పుడు కాళ్లు పట్టుకుంటారు కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత కళ్ళు నెత్తుకెక్కుతాయి అని అంటాడు సామ్రాట్. అప్పుడు లాస్య, ఎవరు ఏమైనా ఆఫీసు పనులు ఆగవు కదా సార్ మీరేం టెన్షన్ పడొద్దు నందు పనులన్నీ నేను చూసుకుంటాను.కంపనీ పరువు నిలపెడతాను అని లాస్య అంటుంది.దానికి సామ్రాట్ లాస్య వైపు అనుమానం మరియు కోపం కలిగిన ముఖంతో చూస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!