800 కోట్ల సినిమాను, డిజాస్టర్ మూవీ కోసం వదులుకున్న కీర్తి సురేష్

Published : Mar 26, 2025, 09:20 PM IST

800 కోట్లు వసూలు చేసిన భారీ బడ్జెట్ సినిమాలో అవకాశం వస్తే వదిలేసుకుంది కీర్తి సురేష్. ఓ డిజాస్టర్ మూవీ కోసం కీర్తి తీసుకున్న నిర్ణయంతో  బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? 

PREV
15
800 కోట్ల సినిమాను, డిజాస్టర్ మూవీ కోసం వదులుకున్న కీర్తి సురేష్
keerthy suresh

కొన్ని సినిమాలు కొంత మందికే రాసిపెట్టి ఉంటాయనుకుంటా. హిట్ సినిమా అవకాశం వచ్చినా.. రాసి పెట్టి ఉండకపోవడంతో డిజాస్టర్ సినిమాల వైపు అడుగు వేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. అలాంటి సంఘటనే హీరోయిన్ కీర్తి సురేష్ లైఫ్ లో జరిగింది. ఓ అద్భుతమైన అవకాశాన్ని ఆమె వదిలేసుకుంది. అది కూడా ఓ ప్లాప్ మూవీ కోసం కీర్తి సురేష్ చేసిన పని.. మరో హీరోయన్ లైఫ్ కు లక్కుగా మారింది. పాన్ఇండియా రేంజ్ లో ఆ హీరోయిన్ ఇమేజ్ ను భారీగా పెంచేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? 

Also Read: 23 ఏళ్లకే 250 కోట్ల ఆస్తలు, స్టార్ హీరోయిన్లకే షాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?

25
Rashmika in Chaava

ఆ మూవీ ఏదో కాదు చావా. అవును విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈసినిమా దేశ వ్యాప్తంగా ఎంత రెస్పాన్స్ ను రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 800 కోట్ల వరకూ కలెక్ష్ చేసిందీ సినిమా. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరెకెక్కిన ఈసినిమాలో విక్కీ భార్య పాత్రలో ముందుగా కీర్తి సురేష్ ను అడిగారట. కాని ఆమె అప్పటికే  తన డేట్స్ ని ‘బేబీ జాన్’ సినిమాకు కేటాయించింది.

Also Read: చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? మెగాస్టార్ తో చనువున్న ఏకైక నటి?

35
keerthy suresh

తమిళం లో సూపర్ హిట్ సినిమాను  బాలీవుడ్ లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా రీమేక్ చేశారు. ఈసినిమాను అట్లీ స్వయంగా నిర్మించారు. కాని ఈసినిమాకు బాలీవుడ్ లో దారుణమైన రెస్పాన్స్ వచ్చింది.  కనీసం 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది  బేబీ జాన్. ఇలాంటి డిజాస్టర్ సినిమా కోసం అంతటి గొప్ప చిత్రాన్ని వదిలేసావా అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు కీర్తి సురేష్ ని ట్యాగ్ చేసి బాధపడుతున్నారు. 

Also Read: రజినీకాంత్ ను ప్రేమించి, నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

45
keerthy suresh

కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ ని కూడా ఈమె మిస్ అయ్యిందట. ఇందులో త్రిష క్యారక్టర్ ని కీర్తి సురేష్ కి పోషించే అవకాశం వచ్చింది. కానీ ఆమె డేట్స్ ని సర్దుబాటు చేయలేక వదులుకుందట, ఇలా రెండు సార్లు బ్లాక్ బస్టర్ సినిమాలు వదిలేకుని కెరీర్ లో ఓ రెండు మెట్లను మిస్ చేసుకుంది కీర్తి సురేష్. 

Also Read: 5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?

55
Keerthy Suresh Antony Thattil LOVE story

ఇక రీసెంట్ గా కీర్తి సురేష్ తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకుంది. 15 ఏళ్ళు ప్రేమించుకున్నా.. చాలా సీక్రేట్ గా మెయింటేన్ చేసింది ఈ బ్యూటీ. పెళ్ళి ప్రకటన వరకూ ఎవరకి తెలియకుండా జాగ్రత్తపడింది. ఇక పెళ్ళి తరువాత కూడా నటించడానికి రెడీ అయ్యింది కీర్తి. బాలీవుడ్ లో ఎక్కువ గా ఆమెకు అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. 

Also Read: అది దా సర్ప్రైజ్ సాంగ్ హాట్ డాన్స్ కు, కేతిక శర్మ అందుకున్న భారీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Read more Photos on
click me!

Recommended Stories