ఈ సినిమా మొదట చేయాల్సింది చిరంజీవినే. మెగాస్టార్‌తో మూవీ చేయాలనే రాజమౌళి, విజయేంద్రప్రసాద్ ఆయన్ని కలిశారు. ఈ కథ చెప్పారు. ఆయన కూడా బాగుందని కొన్ని మార్పులు చెప్పారట. అయితే అప్పుడు చిరుకి చెప్పింది వంద మందిని చంపే ఎపిసోడ్. ప్రాథమికంగా లైన్ అది, దాన్ని డెవలప్ చేయాల్సింది.
చిరు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ మధ్యలో రైటర్ ఇది చిరంజీవికి సెట్ కాదు అని చెప్పాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ సెట్ కాదు, ఎప్పుడూ ఇబ్బందే ఉంటుంది అని రాజమౌళి భావించారు. తర్వాత చిరంజీవి కూడా ఆసక్తి చూపించలేదు. ఇక పూర్తి స్క్రిప్ట్ రాసుకుని మళ్లీ చిరుని కలిశారు.
అప్పుడు చరణ్ కోసమని చెబితే ఓకే చేశారు. అలా చిరంజీవి చేయాల్సిన మూవీతో తాను చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రామ్ చరణ్. `మగధీర` తర్వాత చరణ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస విజయాలతో రాణిస్తున్నారు.