ntr, jr ntr, allu arjun, trivikram
NagaVamsi: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో సూర్య దేవర నాగవంశీ ఒకరు. ఆయన సితార బ్యానర్‌లో, హారికా అండ్ హాసిని బ్యానర్‌లో పదికిపైగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో భారీ పాన్ ఇండియా చిత్రాల నుంచి `మ్యాడ్ 2` లాంటి చిన్న బడ్జెట్ మూవీస్ వరకు ఉన్నాయి.
అయితే వాటిలో ప్రముఖంగా వినిపించే ప్రాజెక్ట్ లు ఎన్టీఆర్, అల్లు అర్జున్ మూవీస్. త్రివిక్రమ్ దర్శకత్వంలో రావాల్సిన ఈ చిత్రాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
naga vamsi
అయితే ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తారక్ అన్నతో తీయబోయే సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని ఆ మధ్య చెప్పారు నాగవంశీ. కానీ ఇప్పుడు షాకిచ్చాడు. ఎన్టీఆర్‌తో నెల్సన్ మూవీ ఉంటుందనే వార్తలు వినిపించిన నేపథ్యంలో సడెన్ ట్విస్ట్ ఇచ్చాడు.
నెల్సన్‌తో మూవీ ఉంటుంది, కానీ అది ఎవరితో ఉంటుందనేది కన్ఫమ్ అయిన తర్వాత చెబుతామన్నారు. హీరో ఎవరనేది తర్వాత చెబుతామని తెలిపారు. నాగవంశీ ఏదైనా బోల్డ్ గా, ఓపెన్‌గా చెబుతారు. ఆయన దాచడమే పలు అనుమానాలకు తావిస్తుంది. మరి ఏం జరగబోతుంది. ఏది నిజమనేది త్వరలో తేలనుంది.
trivikram, allu arjun
ఇక త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమాల గురించి చెబుతూ అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ అప్ డేట్ ఇచ్చారు. ఇది ఈ ఏడాది సెకండాఫ్‌లో స్టార్ట్ అవుతుందన్నారు. ఈ మూవీ ఉంటుందా లేదా? అనే అనుమానాలున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు.
దీన్ని మైథలాజికల్ ఫాంటసీగా రూపొందించబోతున్నారట త్రివిక్రమ్. భారీ బడ్జెట్ మూవీ అని, ఇండియన్ మూవీస్‌లో ఇప్పటి వరకు టచ్ చేయని సబ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు నాగవంశీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
jr ntr, trivikram
ఇంకోవైపు త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ మూవీపై కూడా ఆయన స్పందించారు. తమ బ్యానర్‌లో 50వ మూవీగా దీన్ని ప్లాన్ చేస్తున్నట్టు ఓ ప్రశ్నకి సమాధానం చెప్పారు.
50వ మూవీగా సెట్ అయితే హ్యాపీ అన్నారు. కాబట్టి వీరి కాంబోకి సంబంధించిన వర్క్ కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ మూవీ సెట్ కావడానికి ఇంకా రెండుమూడేళ్లు పట్టే ఛాన్స్ ఉంది.