కేడీ ది డెవిల్ సినిమాకు, ఎన్టీఆర్ హీరోయిన్‌కి మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆమె ఎందుకు ట్రెండ్ అవుతోంది.

Published : Mar 20, 2026, 05:00 PM IST

Viral News: కేడీ ది డెవిల్ సినిమా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సినిమాలోని ఓ పాట కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. వివాదం ఎక్కువ‌య్యేస‌రికి యూట్యూబ్ సైతం పాట‌ను తొల‌గించింది. ఈ త‌రుణంలో ఎన్టీఆర్ హీరోయిన్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. 

PREV
15
అస‌లేంటీ కేడీ ది డెవిల్ వివాదం

కన్నడ స్టార్ ధ్రువ సర్జా హీరోగా తెర‌కెక్కుతోన్న తాజా చిత్రం ‘కేడీ: ది డెవిల్’. ఇందులో సంజయ్‌ దత్‌, శిల్పా శెట్టి, నోరా ఫతేహి, రీష్మా కీలక పాత్రలు పోషించారు. విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో చిక్కుత‌కుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుద‌ల‌ చేసిన ‘సర్కే చునార్‌’ అనే పాటపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో యూట్యూబ్ నుంచి ఈ పాట‌ను తొల‌గించారు. తెలుగులో ఈ పాట పాడిన మంగ్లీ సైతం క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

25
తెర‌పైకి ఆ హీరోయిన్ పేరు

ఇదిలా ఉంటే ఈ పాట వివాదం నెల‌కొన్న త‌రుణంలో ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ పేరు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఆ న‌టి మ‌రెవ‌రో కాదు ర‌క్షిత‌. తెలుగులో ఎన్టీఆర్ స‌ర‌స‌న ఆంధ్రావాలా, ర‌వితేజ స‌ర‌స‌న ఇడియ‌ట్ సినిమాల్లో క‌నిపించి న‌టిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కేడీ ది డెవిల్‌తో తెర‌పైకి వ‌చ్చారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఈ సినిమా ద‌ర్శ‌కుడు ప్రేమ్ భార్యే ర‌క్షిత‌.

35
ఈ పాట విష‌యంలో ఎందుకింత రాద్ధాంతం అంటూ

ఈ పాట‌ని తొలగించాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) అధికారులను కేంద్రం ఆదేశించ‌డంపై చిత్ర ద‌ర్శ‌కుడి భార్య అయిన ర‌క్షిత స్పందించారు. స్టాగ్రామ్ లో  సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ... గతంలో వచ్చిన ‘పీలింగ్స్’ (పుష్ప 2), ‘చోళీ కే పీచే’ వంటి పాటలను జనం మామూలుగానే తీసుకున్నారని, ఇప్పుడు ఈ ఒక్క పాట విషయంలోనే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆమె ప్రశ్నించింది. ఒక పాట సరిగ్గా లేనంత మాత్రాన దర్శకుడిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని రాసుకొచ్చారు.

45
ర‌క్షిత కెరీర్ విష‌యానికొస్తే..

రక్షిత తన కెరీర్‌ను కన్నడలో స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘అప్పూ’ సినిమాతో ప్రారంభించారు. అదే కథను తెలుగులో ‘ఇడియట్‌’ పేరుతో రీమేక్ చేయగా, అందులో రవితేజ సరసన నటించి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘సుచిత్ర’ పాత్రతో యువతలో ప్రత్యేక స్థానం సంపాదించారు.

55
వివాహం త‌ర్వాత నిర్మాతగా రక్షిత ప్రయాణం

2007లో దర్శకుడు ప్రేమ్‌ను వివాహం చేసుకున్న తర్వాత రక్షిత నటనకు దూరమయ్యారు. అయితే సినిమా రంగాన్ని మాత్రం వదల్లేదు. నిర్మాతగా మారి ‘జోగయ్య’, ‘ఏక్ లవ్ యా’, ‘డీకే’ వంటి సినిమాలు నిర్మించారు. ‘ఏక్ లవ్ యా’లో అతిథి పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా టెలివిజన్ షోలలో జడ్జిగా, హోస్ట్‌గా కూడా పనిచేశారు.

Read more Photos on
click me!

Recommended Stories