India Top 10 Heroes: మహేష్‌ కి చరణ్‌ ఝలక్‌, టాప్‌ 10లోకి దూసుకొచ్చిన పవన్‌.. నెంబర్‌ 1 ఎవరంటే?

Published : Mar 20, 2026, 04:16 PM IST

India Top 10 Heroes: ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోనే టాప్‌ 10 హీరోల జాబితాని విడుదల చేస్తుంటుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన లిస్ట్ ని విడుదల చేసింది. టాప్‌ 10 లో నిలిచిన హీరోలు ఎవరో చూద్దాం. 

PREV
18
ఇండియా టాప్‌ 10 హీరోలు

పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ వచ్చాక ఎవరు టాప్‌ హీరో అనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. సినిమా కలెక్షన్లని బట్టి టాప్‌ హీరో ఎవరో అభిమానులు తేల్చేస్తున్నారు. కానీ వారి ఇమేజ్‌, చేసే సినిమాలు, బ్రాండ్‌ వ్యాల్యూ, ఫాలోయింగ్‌ వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రముఖ సర్వే సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోని మోస్ట్ పాపులర్‌ హీరోలకు సంబంధించిన టాప్‌ 10 లిస్ట్ ని విడుదల చేస్తుంటుంది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన లిస్ట్ ని రిలీజ్‌ చేసింది. ఇందులో మహేష్‌ బాబుకి రామ్‌ చరణ్‌ షాక్‌ ఇవ్వగా, పవన్‌ కళ్యాణ్‌ ఏకంగా టాప్‌ 10 లిస్ట్ లోకి దూసుకొచ్చాడు. మరి టాప్‌ 10లో ఉన్నది ఎవరంటే?

28
నెంబర్‌ 1 స్థానం ప్రభాస్‌ దే

ఎప్పటిలాగానే ప్రభాస్‌ ఫస్ట్ ప్లేస్‌ సొంతం చేసుకున్నారు. ఆయన తిరుగులేని విధంగా మొదటి స్థానంలో దూసుకుపోతున్నారు. తనకు పోటీ ఎవరూ లేరని చాటి చెప్పారు. అంతేకాదు చాలా కాలంగా ప్రభాస్‌ నెంబర్‌ 1 స్థానంలో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది `ది రాజాసాబ్‌`తో ఆడియెన్స్ ని అలరించిన ప్రభాస్‌ ఇప్పుడు `ఫౌజీ`, `స్పిరిట్‌` చిత్రాల్లో నటిస్తున్నారు.

38
నెంబర్‌ 2లో విజయ్‌.. కారణం ఇదే

కోలీవుడ్‌ స్టార్‌ దళపతి విజయ్‌ ఈ లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన కూడా ప్రభాస్‌లాగానే తన స్థానాన్ని పదిలపర్చుకుంటున్నారు. తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌తో, పాపులారిటీతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన `జన నాయకుడు` మూవీ ఆగిపోయిన విషయం తెలిసిందే. అదే సమయంలో త్రిషతో ఎఫైర్‌, తన భార్య సంగీత విడాకుల కోసం కోర్ట్ కి వెళ్లడంతో వార్తల్లో నిలుస్తున్నారు విజయ్‌. అదే సమయంలో రాజకీయంగానూ ఆయన వార్తల్లో నిలుస్తున్నారు.

48
మూడో స్థానంలో ఐకాన్‌ స్టార్‌

ఇక గత నెలలో అల్లు అర్జున్‌ మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే స్థానాన్ని దక్కించుకున్నారు. బన్నీ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఏఏ 22 మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. అదే సమయంలో ఆయన ఫాలోయింగ్‌కి సంబంధించిన డిస్కషన్‌ ఆ మధ్య బాగా చర్చనీయాంశం అయ్యింది. 42 రూల్స్ అనేది పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. నాల్గో స్థానంలో బాలీవుడ్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ నిలిచారు. ఆయన గత నెలలో కూడా అదే స్థానంలో ఉన్నారు.

58
మహేష్‌ బాబుకి షాక్‌ ఇచ్చిన రామ్‌చరణ్‌

ఐదో స్థానం విషయంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. మహేష్‌ బాబుకి రామ్‌ చరణ్‌ పెద్ద షాక్‌ ఇచ్చారు. ఊహించని విధంగా ఐదో స్థానంలోకి ఆయన దూసుకువచ్చారు. ఏడో స్థానంలో ఉన్న రామ్‌చరణ్‌ ఐదో స్థానంలోకి రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే `పెద్ది` సినిమా రిలీజ్‌ కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగానే చరణ్‌ హవా పెరిగిందని చెప్పొచ్చు. 

68
ఆరో స్థానానికి పడిపోయిన మహేష్‌ బాబు

మహేష్‌ బాబు ఆరో స్థానానికి పడిపోయారు. గత నెలలో ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం `వారణాసి` సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన చర్చ ఈ మధ్య పెద్దగా లేదు. దీంతో ఆయన ఒక్క స్థానం పడిపోయారు. ఏడో స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ ఉన్నారు. ఆయన ఆరో స్థానం నుంచి పడిపోయారు.

78
ఎనిమిదవ స్థానంలో ఎన్టీఆర్‌

 ఎనిమిదో స్థానంలో ఎన్టీఆర్‌ నిలిచారు. ఎన్టీఆర్‌కి సంబంధించిన చర్చ బాగానే జరిగింది. `డ్రాగన్‌` మూవీ అప్‌డేట్లు వచ్చాయి.  పబ్లిక్‌లోకి వచ్చారు. అయినా ఎన్టీఆర్‌ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆయన 8వ స్థానంలోనే ఉన్నారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ 9వ స్థానంలో నిలిచారు. ఆయన గత నెలలో కూడా అదే స్థానంలో ఉన్నారు.

88
టాప్‌ 10 లిస్ట్ లోకి పవన్‌ కళ్యాణ్‌

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్‌ 10లోకి మళ్లీ పవన్‌ కళ్యాణ్‌ దూసుకురావడం విశేషం. ఆయన ఓజీ సినిమా సమయంలో ఈ లిస్ట్ లోకి వచ్చారు. ఒకటి రెండు నెలలు ఆయన ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ లేరు. ఇప్పుడు మరోసారి ఆయన లిస్ట్ లోకి రావడం విశేషం. పవన్‌ ఫిబ్రవరిలో పదవ స్థానాన్ని దక్కించుకున్నారు. బాలీవుడ్‌ హీరోలకు ఝలక్‌ ఇచ్చారు. గత నెలలో అక్షయ్‌ కుమార్‌ ఆస్థానంలో ఉండగా, ఆయన ఈ సారి లిస్ట్ లో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ చిత్రంలో నటించారు. ఇది ఉగాది సందర్భంగా గురువారం విడుదలయ్యింది. ఇది మిశ్రమ స్పందనని రాబట్టుకుంటోంది. కలెక్షన్లు బాగానే ఉండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories