అలా కనిపించడం ఇష్టంలేక ఫస్ట్ రిజెక్ట్ చేశా, వాళ్ళు చేయగా లేనిది నేను చేయలేనా?కార్తీకదీపం ప్రియమణి రియల్ లైఫ్!

First Published Jul 22, 2021, 12:34 PM IST

బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ ఓ సంచలనం. టీఆర్పీ విషయంలో నేషనల్ రికార్డ్స్ బద్దలు కొట్టింది కార్తీకదీపం. ఈ సీరియల్ లోని పాత్రలు ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయాయి.

ప్రధాన పాత్రలైన కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, దీప అలియాస్ వంటలక్క పిచ్చ ఫేమస్. ఈ రెండు పాత్రలపై లెక్కలేనన్ని మీమ్స్ పుట్టుకు వస్తూ ఉంటాయి.
undefined
కార్తీకదీపం సిరియల్ లేడీ విలన్ మోనిత పాత్ర ఎంత ఫేమస్సో... ఆమె ప్రక్కన ఉండే ప్రియమణి పాత్ర కూడా అంతే ఫేమస్. సీరియస్ విలన్ మోనిత పక్కన ఉంటూ ఆమె కుట్రలలో భాగం పంచుకునే పనిమనిషిగా ప్రియమణి పాత్ర ఉంటుంది. విలనిజంతో పాటు కామెడీ పంచే ఈ పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా ఇష్టం.
undefined
కార్తీకదీపం పనిమనిషి ప్రియమణిగా పాప్యులర్ అయిన శ్రీదివ్య నిజ జీవితంలో చాలా కష్టాలే ఉన్నాయట. ఓ ఇంటర్వ్యూలో శ్రీదివ్య తన వ్యక్తిగత విషయాలు, కెరీర్, క్యాస్టింగ్ కౌచ్ గురించి అనేక విషయాలు వెల్లడించారు.
undefined
చిన్న వయసులోనే శ్రీదివ్య కు పెద్దవాళ్ళు వివాహం చేశారు. గృహిణిగా ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కువగా సీరియల్స్ చూసేవారట. సీరియల్స్ చూస్తున్నప్పుడు కొందరు యాక్టర్స్ ముఖాలు చూసి, వాళ్ళు చేయగా లేనిది నేను చేయలే,నా అని ఫిక్స్ అయ్యారట శ్రీదివ్య.
undefined
దీనితో ఇంట్లో వాళ్ళను ఒప్పించి 2014 పరిశ్రమలో అడుగుపెట్టారట. పరిశ్రమ గురించి అసలు ఎటువంటి ఐడియా లేని శ్రీదివ్యకు మొదట్లో ఓ వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ దక్కిందట.
undefined
ఆ సిరీస్ లోని మెయిన్ హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారట.  షూటింగ్ స్టార్ట్ అయ్యాక తనని ఫ్రేమ్ లో చూసి డైరెక్టర్ హీరోయిన్ గా ప్రమోట్ చేశారట.
undefined
అయితే హీరోయిన్ అంటే పొట్టి బట్టలు వేసుకోవాలి, అలా కనిపించడం ఇష్టం లేక చేయనని చెప్పారట శ్రీదివ్య. అయితే పక్కన ఉన్నవాళ్లు మంచి అవకాశం అని చెప్పడంతో ఒప్పుకున్నారట.
undefined
కానీ దురదృష్ట వశాత్తు ఆ సిరీస్ మధ్యలో ఆగిపోయిందట. కార్తీకదీపం కంటే ముందు మహాలక్ష్మీ, జాబిలమ్మ సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ చేశాను. అనేక సినిమాలలో జస్ట్ ఒక ఫ్రేమ్ లో కనిపించాను.. అని శ్రీదివ్య అన్నారు.
undefined
కార్తీకదీపంలో పనిమనిషిగా చిన్న పాత్రనే అయినా మంచి పేరు తెచ్చిపెట్టిందని శ్రీదివ్య తెలిపారు. గతంలో చేసిన సీరియల్స్ లో పాత్ర నిడివి ఎక్కువ అయినా, ఈ స్థాయి గుర్తింపు రాలేదు. అంతా కార్తీకదీపం క్రేజ్ వలనే అన్నారు శ్రీదివ్య.
undefined
శ్రీదివ్యకు ఇద్దరు పిల్లలు కాగా, పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు.
undefined
ఇక అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో శ్రీదివ్య పనిమనిషి రోల్ చేశారట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.
undefined
click me!