దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీక్, జాతీయ స్థాయి పరీక్షల అక్రమాలపై జెన్-జీ యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అయితే, ఈ ఆందోళనలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సోషల్ మీడియాలో స్పందించిన కంగనా, నిరసనల్లో పాల్గొన్న యువతను, వారి ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారు. జెన్-జీ నిరసనల వీడియోలు చూస్తుంటే తనకు వాంతులు వస్తున్నాయని, వారి భాష, ప్రవర్తన అత్యంత అసహ్యకరంగా ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా, ఈ తరాన్ని 'గట్టర్ జనరేషన్' అని అభివర్ణిస్తూ, "ఇలాంటి వారిని ఎవరు కంటున్నారు? ఎలా పెంచుతున్నారు?" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కనీసం చదువుసంధ్యలు లేని వీరు వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగపడరని, సొంత ఇల్లు కూడా చక్కదిద్దలేరంటూ మరో వివాదానికి తెరలేపారు.