Ramayana Trailer: నితేష్ తివారీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రామాయణ'. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఎప్పుడో తేలిపోయింది.
ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది 'రామాయణ'మే. ఈ సినిమా గురించి వచ్చిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా థియేటర్లలోకి రానుంది. మొదటి భాగం దీపావళికి రిలీజ్ కానుండగా, దీనికి సంబంధించిన ఓ సూపర్ అప్‌డేట్‌ను మేకర్స్ ఇచ్చారు. జూలై 30, గురువారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 4:15 గంటలకు 'రామాయణ' ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
24
రికార్డు ధరకు రామాయణ మ్యూజిక్ రైట్స్..
ఇదిలా ఉంటే 'రామాయణ' మ్యూజిక్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ సంస్థ టీ-సిరీస్ ఈ హక్కులను దక్కించుకుంది. ఏకంగా 75 కోట్ల రూపాయల అడ్వాన్స్ డీల్ కుదిరిందని, ఇండియన్ సినిమాలో ఇది అతిపెద్ద మ్యూజిక్ డీల్స్‌లో ఒకటని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా రిపోర్ట్ చేశారు. ఇక ఈ సినిమా ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం 250 కోట్లు చెల్లించినట్లు 'వెరైటీ' పత్రిక రిపోర్ట్ చేసింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ దగ్గర ఉన్నాయి.
34
రామాయణ లో పాత్రధారులు ఎవరెవరంటే?
నితేష్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా ప్రముఖ నటి శోభన నటిస్తున్నారు. ఒకప్పుడు దూరదర్శన్‌లో వచ్చిన రామాయణంలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ఈ సినిమాలో దశరథ మహారాజుగా కనిపించనుండటం విశేషం. లక్ష్మణుడిగా రవి దుబే, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, విశ్వామిత్రుడిగా అజింక్య డియో, ఇంద్రుడిగా కునాల్ కపూర్ నటిస్తున్నారు.
ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది సార్లు ఆస్కార్ గెలుచుకున్న ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో DNEG, యశ్ సొంత నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విజేతలైన హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో పెద్ద హైలైట్. ఈమూవీ రిలీజ్ కోసం అభిమానులు, ఆడియన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి రిలీజ్ తరువాత రామాయణ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.