దేవర సినిమాతో పర్వాలేదనిపించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అనుకున్నదానికంటే కాస్త తగ్గినా.. దేవర టీమ్ హ్యాపీనే. అయితే దేవర 2 కోసం మాత్రం ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారట. కథలో భారీ మార్పులు కూడా చేస్తున్నారట. దానికి కారణం అల్లు అర్జున్ పుష్ప2నేనా.
టాలీవుడ్ యంగ్ టైగర్.. గ్లోబల్ హీరో ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ భారీ అంచనాల మధ్య లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలనే రాబట్టింది. కాని అనుకున్నంత విజయం మాత్రం సాధించలేకపోయింది. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ.. ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓటీటీలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది దేవర.
ఇక దేవర తరువాత ఈ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు టీమ్. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ‘దేవర పార్ట్-2 సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేదానిపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు టీమ్. ఇప్పటికే కొరటాల టీమ్ ఈసినిమాకు సబంధించిన స్క్రిప్ట్ పనులు సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారట. ఇక ఫైనల్ వర్షన్ రెడీ చేయడమే తరువాయి అంటున్నారు.
అయితే దేవర అనుకున్నంత రాలేదు కాబట్టి.. దేవర పార్ట్ 2 నుమాత్రం చాలా జాగ్రత్తగా ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్ తో గత కొన్ని వారాలుగా హోమ్ వర్క్ చేస్తున్నారట. ఇక అందుకోసం దేవర సీక్వెల్ పార్ట్ కథలో మేజర్ మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
దీనికి కారణం అల్లు అర్జున్ పుష్ప2నే అంటున్నారు. పుష్ప2 నార్త్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కంటే అక్కడే ఎక్కవు కలెక్ష్లు సాధించింది. బాలీవుడ్ లో బన్నీకి ఎక్కడ లేని ఇమేజ్ ను సాధించి పెట్టింది.
అయితే బాలీవుడ్ లో ఈ సినిమా ఇంతలా ఆడటానికి సుకుమార్ ప్లానింగ్ కారణం. బన్నీ క్యారెక్టర్ కాని.. అతను పాన్ పరాక్ నవులుతూ.. నార్త్ ఇండియన్ స్టైల్ లో కనిపించాడు పుష్ప2 లో. దాంతో అక్కడ ఈ పాత్రను బాగా ఆదరించారు. సో దేవర టీమ్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమా కథలో నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
దేవర బాగుంది.. కాని కాస్త అటు ఇటు మార్పులు చేస్తే.. పుష్ప2 మాదిరిగా చెలరేగిపోతుంది. బన్నీ లాగే తారక్ కూడా పాత్ర కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు.. ఎంత కష్టం అయినా పడతాడు. సో ఈసినిమాలో భారీ మార్పులతో సీక్వెల్ రాబోతున్నట్టు సమాచారం. ఇక ఈమూవీ షూగింగ్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం తారక్ వార్ 2 షూటింగ్ లో ఉన్నాడు.
66
Prashanth Neel, NTR Jr, kgf
తరువాత ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నాటికి తన పార్ట్ మేజర్ షూటింగ్ కంప్లీట్ చేసి.. దేవర సీక్వెల్ స్టార్ట్ చేస్తాడని సమాచారం. మరి ఇందులో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.