ఈ సినిమాలు చూస్తే చాలు, దేశభక్తి అంటే ఏంటో అర్థం అవుతుంది.. ప్రాణం పెట్టి నటించిన హీరోలు వీళ్ళే

Published : Jan 26, 2025, 11:40 AM IST

దేశం మొత్తం 76 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రిపబ్లిక్ డే రోజున దేశభక్తి అంటే ఏంటో తెలియజేసేలా చిత్రీకరించిన అద్భుతమైన చిత్రాల గురించి తెలుసుకుందాం.   

PREV
17
ఈ సినిమాలు చూస్తే చాలు, దేశభక్తి అంటే ఏంటో అర్థం అవుతుంది.. ప్రాణం పెట్టి నటించిన హీరోలు వీళ్ళే
Rana Daggubati, Adivi Sesh, Superstar Krishna

దేశం మొత్తం 76 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రిపబ్లిక్ డే రోజున దేశభక్తి అంటే ఏంటో తెలియజేసేలా చిత్రీకరించిన అద్భుతమైన చిత్రాల గురించి తెలుసుకుందాం. 

 

27
Super Star Krishna

అల్లూరి సీతారామరాజు

సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం అల్లూరి సీతా రామరాజు. మన్యం వీరుడిగా ఈ చిత్రంలో కృష్ణ ప్రాణం పెట్టి నటించారు. అల్లూరి పాత్రలో కృష్ణ నటించిన నటన చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఇంతకంటే గొప్పగా ఇంకెవరూ తెరకెక్కించలేరు అని స్వయంగా ఎన్టీఆర్ ప్రశంసించారట. 

37

తాండ్ర పాపారాయుడు 

బొబ్బిలి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించిన బ్రిటిష్ వారిపై తిరుబాటు చేసి పోరాడిన తాండ్ర పాపారాయుడు జీవిత చరిత్రే ఈ చిత్రం. దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణంరాజు టైటిల్ రోల్ లో నటించారు. 

47

ఖడ్గం 

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త తరం దేశభక్తి చిత్రం ఖడ్గం. ఈ చిత్రం ఘనవిజయం సాధించడమే కాదు అనేక అవార్డుని సొంతం చేసుకుంది. హిందూ ముస్లింలో ఎలా కలసిమెలసి ఉండాలో ఈ చిత్రం చెబుతుంది. 

 

57

మేజర్ 

ఆర్మీ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ చిత్రంగా మేజర్ మూవీ తెరకెక్కింది. అడివి శేష్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశాడు. 26/11 ముంబై దాడుల్లో తాజ్ హోటల్ వద్ద టెర్రరిస్టులతో పోరాడుతూ సందీప్ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. 

 

67

ఘాజి 

దేశభక్తి చిత్రాల్లో ఇది వైవిధ్యమైన చిత్రం అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశభక్తిపై అనేక చిత్రాలు వచ్చాయి. కానీ అండర్ వాటర్ లో షబ్ మెరైన్ వార్ నేపథ్యంలో ఇండియాలో సినిమాలు రావడం చాలా అరుదు. తెలుగులో అయితే ఇదే తొలి ప్రయత్నం. దర్శకుడు సంకల్ప్ రెడ్డి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రానా పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. 

 

77

ఆర్ఆర్ఆర్ 

అల్లూరి సీతా రామరాజు, కొమరం భీం లపై ఫిక్షనల్ కథతో రాజమౌళి తెరకెక్కించిన అపురూప చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో రాజమౌళి దేశభక్తిని చూపిస్తూనే వీళ్లిద్దరి మధ్య స్నేహాన్ని కూడా హైలైట్ చేశారు. ఎన్టీఆర్, రాంచరణ్ ఈ చిత్రం కోసం కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 

click me!

Recommended Stories