Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్స్ విజయ్, రష్మిక పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇటీవలే ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లారు. దానికి సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ గా మారాయి...
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవర కొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. రెండు నెలల క్రితం ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ఎంత హల్ చల్ చేశాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కాగా, పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజుని రష్మిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలోనే ఈ జంట కూర్గ్ లో హనీమూన్ కి వెళ్లడం విశేషం.
23
ఒక్క రాత్రికి రూమ్ రేటు ఎంతంటే...
కూర్గ్ లోని దట్టమైన అడవులు మధ్య ఉన్న ‘ఇవాల్వ్ బ్యాక్ రిసార్ట్’ లో ఈ జంట బస చేశారు. ఇక్కడ వారు స్టే చేసిన ప్రైవేట్ విల్లా ధర అక్షరాలా ఒక్కరాత్రికి రూ. లక్ష పైనే ఉంటుందని సమాచారం. ప్రకృతి ఒడిలో, ప్రైవేట్ పూల్, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ బంగ్లాలో రష్మిక తన 30వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.
33
ఖరీదైన ఆతిథ్యం..
ఉదయ్ పూర్ లోని వివాహం తర్వాత ఈ జంట వెళ్లిన మొదటి ట్రిప్ ఇది. రష్మిక తన భర్త విజయ్ కి తన సొంత గడ్డ అయిన కూర్గ్ లోని అందాలను, అక్కడి సంప్రదాయాలను పరిచయం చేయడానికి ఈ ఖరీదైన రిసార్ట్ ను వేదికగా చేసుకున్నారు. ఈ రిసార్ట్ యాజమాన్యం కూడా ఈ పవర్ కపుల్ కు ఆతిథ్యం ఇవ్వడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
లక్షల విలువైన రిసార్ట్ ల బస చేయడమే కాకుండా, రష్మిక తన మూలాలను మర్చిపోకుండా సంప్రదాయ కొడగు చీరలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. విజయ్ కూడా వారి సంప్రదాయానికి తగినట్లు దుస్తులు ధరించడం విశేషం.