Janhvi Kapoor: జాన్వి కపూర్.. శ్రీదేవి కూతురుగా మొదట గుర్తింపు పొందింది. తర్వాత సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. కానీ 15 ఏళ్ల వయసులో తన జీవితం లో జరిగిన ఘటనను మాత్రం ఇప్పటికీ మర్చిపోలేక ఇబ్బంది పడుతోంది.
శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్‌కు ఎంతో గుర్తింపు ఉంది. కేవలం తల్లి పేరుతో వచ్చిన గుర్తింపునే కాదు.. తన సొంత గుర్తింపును కూడా సాధించింది జాన్వి. ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోలింగ్ గురించి మాట్లాడింది. అందులో ముఖ్యంగా తనకు 15 ఏళ్ల వయసులో జరిగిన ఘటనను ఇప్పటికీ మర్చిపోలేనని ఆమె చెప్పింది. తాను ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక అశ్లీల వెబ్ సైట్లో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి పెట్టారని వివరించింది. ఆ క్షణం తనకు విపరీతమైన బాధ కలిగిందని చెప్పింది జాన్వి. ఆ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతోంది.
24
స్నేహితుల జాన్వీ ఫోటోలు చూసి
తాను చదివిన పాఠశాలలో కంప్యూటర్ క్లాసులు జరిగేవని,ఆ సమయంలో క్లాసులోని అబ్బాయిలు అడల్ట్ సైట్లను సందర్శించే వారని చెప్పింది. ఒక సైట్లో తన ఫోటోలు చాలా అశ్లీలంగా మార్ఫింగ్ చేసి కనిపించాయని వివరించింది. స్కూల్లోనే అలాంటి ఘటన జరగడంతో తాను తట్టుకోలేకపోయాను అని చెప్పింది జాన్వీ. అది డీప్ ఫేక్ అవునో కాదో తనకు తెలియదని.. కానీ అలాంటి ఒక సైట్లో నా ఫోటోలు చూడడం చాలా కష్టంగా అనిపించిందని, దాని గురించి తన క్లాసులో స్నేహితులు పదేపదే అడగడం కూడా ఎంతో ఇబ్బంది గురి చేసిందని ఆమె వివరించింది. సంవత్సరాలు గడిచినా కూడా ఆ విషయం ఇంకా తనను వెంటాడుతూనే ఉందని..తాను ఎప్పుడూ వేసుకోని దుస్తులలో లేదా ఎప్పుడూ తాను పెట్టని పోజు లేదా భంగిమలో ఉన్న ఫోటోలు తనను చాలా ఇబ్బంది పెట్టాయంటూ జాన్వి కపూర్ తన మనసులోని బాధను పంచుకుంది.
34
దర్శకులతో సమస్యలు రావచ్చు
ఇలాంటి ఫేక్ చిత్రాలు తన వృత్తిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని జాన్వీ చెప్పింది. ఇది ఒక రకమైన అభిప్రాయాన్ని ఇతరులకు కలిగిస్తుందని వివరించింది. ‘రేపు ఎప్పుడైనా నేను ఏదైనా దుస్తులు వేసుకోవడానికి సౌకర్యంగా లేదని దర్శకుడికి చెడితే.. అతడు ఈ ఫోటోలను చూపించి నువ్వు ఇదివరకు ఇలాంటివి వేశావు కదా అని అనవచ్చు.. అప్పుడు నేను ఏం మాట్లాడాలి’ అంటూ బాధతో చెప్పింది జాన్వీ. కానీ ఆ ఘటనను మర్చిపోలేకపోతున్నానని, ఆ క్షణంలో తాను ఎంతో ఏడ్చానని చెప్పింది.
ప్రస్తుతం జాన్వీకపూర్ సినిమాలపరంగా దూసుకెళ్తోంది. వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. నెగెటివిటీని పట్టించుకోవడం మానేసింది. కానీ 15 ఏళ్ల వయసులో జరిగిన ఆ ఘటనను మాత్రం మర్చిపోలేకపోతోంది. ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమాలో నటిస్తోంది. ఇది ఏప్రిల్ 30న థియేటర్లలోకి రానుంది. గతంలో కూడా దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది జాన్వి. ఇప్పటికే ఆమె అందానికి, డాన్స్ కు మంచి మార్కులే ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు.