తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది అలనాటి తారల్లో రమాప్రభ ఒకరు. నటనకు దూరంగా ప్రశాంత జీవితం గడుపుతున్న రమాప్రభను ఓ స్టార్ హీరో భార్య, ఒకప్పటి స్టార్ హీరోయిన్, దర్శకురాలు దారుణంగా అవమానించిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఏమంటున్నారంటే?
రమాప్రభ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ తార. దాదాపు మూడు తరాల నటీనటులతో కలిసి ఆమె సిల్వర్ స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు రమాప్రభ. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలం నుంచి.. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, ఆతరువాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల వరకూ మూడు తరాల వారితో నటించింది రమాప్రభ. ఇప్పటికీ అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. 79 ఏళ్ల రమాప్రభ.. ఓ పల్లెటూరిలో ఇల్లు కట్టుకుని.. తన తమ్ముడి కుటుంబంతో కలిసి ఉంటోంది.
25
15 వందలకు పైగా సినిమాలు..
దాదాపు 15 వందలకు పైగా సినిమాల్లో నటించింది రమాప్రభ. కోట్లలో ఆస్తులుసంపాదించింది. కాలక్రమంలో ఆ ఆస్తులను పొగొట్టుకుంది కూడా. ఆతరువాత కొన్నిసినిమాల్లో నటిస్తూ..కాస్త కూడబెట్టుకుంది. ఇండస్ట్రీకి.. హైదరాబాద్ కు దూరంగా బ్రతుకుతుంది.
శరత్ బాబుతో పెళ్ళి, విడాకులు ఆమె జీవితాన్ని మార్చేసింది. తన ఆస్తి శరత్ బాబు కాజేశారంటూ చాలా సందర్భాల్లో చెప్పుకోచ్చారు రమాప్రభ. ఇక ఇండస్ట్రీకి కూడా దూరంగా మదనపల్లెలో తన తమ్ముడి కుటుంబంతో పాటు ఉంటోంది.. అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్ లో అడుగుపెడుతోంది.
35
రమాప్రభకు ఇండస్ట్రీ నుంచి సాయం..
అంతే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మందితో మాత్రమే ఆమె కాటాక్ట్ లో ఉంది. రమా ప్రభ పరిస్థితి బాలేదు అని కొంత మంది ప్రచారం చేసినా.. తాను హ్యాపీగా ఉన్నానని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆత్మీయులుగా ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ తో పాటు సీనియర్ హీరో నాగార్జున లాంటి వారు.. నెల నెల రమాప్రభకు ఆర్ధిక సాయం పంపిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని రమాప్రభ చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించారు.
ఇక రమాప్రభా మాలో మెంబర్ కావడంతో.. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి హైదరాబాద్ కు వస్తుంటారు. ఇలానే ఓ సారి ఓటు వేయడానికి వచ్చిన రమా ప్రభకు అక్కడ ఒక అవమానం జరిగింది. అలనాటి స్టార్ హీరో కృష్ణ భార్య.. స్టార్ డైరెక్టర్ విజయనిర్మల రమా ప్రభను అన్న మాట వైరల్ అయ్యింది.
ఎలక్షన్ లో ఓటు వేయడానికి వచ్చిన కృష్, విజయ నిర్మలను రమాప్రభ ఆప్యాయంగా పలకరించగా.. విజయ నిర్మల మాత్రం కోపంగా రమాప్రభపై మాటలు విసిరింది. కుక్క తోక వంకరా అంటూ పదే పదే రిపిట్ చేస్తూ.. అవమానించింది. దాంతో రమాప్రభ ముఖం చిన్నబుచ్చుకున్నట్టు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
55
ప్రభుత్వ సత్కారానికి నోచుకోని నటి..
హీరోయిన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. తల్లిగా, భామ్మగా.. ఎన్నో పాత్రలో మెరిసిన రమాప్రభ తెలుగు సినిమా మొదటి తరానికి.. యుతరానికి వారధిగా ఉన్నారు. క్రమశిక్షణకలిగిన జీవన శైలి.. అలవాట్ల వల్ల.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఇండస్టరీ గౌరవించుకుని.. సన్మానించుకోదగ్గ నటీమణుల్లో రమాప్రభ కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సత్కారాలు ఆమెను వరించలేదు. 1500 లకు పైగా సినిమాల్లో నటించినా.. పద్మశ్రీ కూడా వరించకపోవడం.. నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయం.