కాంతార, సీతారామం, కాశ్మీర్ ఫైల్స్.. 2022లో సైలెంట్ గా వచ్చి సెన్సెషన్ క్రియేట్ చేసిన సినిమాలేంటి..?

First Published Dec 16, 2022, 1:32 PM IST

2022 పూర్తి కావస్తోంది. ప్రతీ ఏడాదిలానే ఈ ఏడాది కూడా అనుకోకుండా వచ్చి..సర్ ప్రైజింగ్ సక్సెస్ ను సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే.. ఈ ఏడాది సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. మరి అవేంటి.. చూద్దాం.. 2022 రౌండప్ లో..
 

కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అవుతాయి. అసలు ఆ సినిమాల షూటింగ్స్ జరిగినట్టు కూడా ఎవరికి తెలియదు. రిలీజ్ అయినప్పుడు కూడా పెద్దగా హడావిడి ఉండదు. కాని సినిమాలో సత్తా ఉంటే చాలు రిలీజ్ అయిన నాలుగైదు రోజులు తరువాత కూడా అంచనాలు పెరిగి.. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి. అలాంటి సినిమాలు ఈ ఏడాది కొన్ని సందడి చేశాయి. అవేంటంటే.. 

kantara

ఈలిస్ట్ లో మనం ముందుగా మాట్లాడుకోవల్సిన సినిమా ఏంటో అందరకి తెలిసిందే. కన్నడ నాట నుంచి రిలీజ్ అయ్యి.. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది సినిమా. ఈ సినిమాలో కథ, మేకప్, మ్యూజిక్.. తో పాటు క్వాలిటీ స్క్రీన్ ప్లే.. ముఖ్యంగా రిషభ్ శెట్టి యాక్టింగ్ ఈసినిమాకు 100 శాతం ప్లాస్ అయ్యింది. అంతే కాదు ఈసినిమాకు డైరెక్షన్ తో పాటు స్క్రీన్ స్లే కూడా అతనే.  ముందు కన్నడాలో రిలీజ్ అయ్యి.. ఆతరువాత పాన్ ఇండియాను ఆకర్షించింది సినిమా.. 16 కోట్లతో తెరకెక్కిన ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా.. 400 కోట్లకుపైగా వసూలు చేసింది సినిమా. రిలీజ్ అయిన ప్రతీ భాషలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

sita ramam hindi total box office five weeks dulquer salmaan mrunal thakur

ఇక ఈ లిస్ట్ లో చేరిన సెకండ్ మూవీ సీతారామం.  ఈ ఏడాది వచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ ఎపిక్ లవ్ స్టోరీలో ఒకటి ఇది. అయితే ఈ సినిమాపై కాస్త అంచనాలతోనే రిలీజ్ అయ్యింది సినిమా. అందులో ఈమూవీలో విశేషం ఏంటీ అంటే.?హీరో మలయాళం, హీరోయిన్ మరాఠి, అసలు టాలీవుడ్ కు సబంధం లేని ఇద్దరు తారలతో.. తెలుగు దర్శకుడు చేసిన ప్రయోగం సీతారామం. ఈమూవీతో దుల్కర్ టాలీవుడ్ హీరో అనిపించుకోగా.. మృణాల్ కు వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది మూవీ. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు హను రాఘవపూడికి సీతారామం మెమరబుల్ హిట్ ను ఇచ్చింది. 

bimbisara

ఇక ఇదే టైమ్ లో వచ్చిన మరో సినిమా బింబిసార. పటాస్ తరువాత అలాంటి హిట్ కోసం ఎదరు చూస్తున్న నందమూరి హీరో కల్యాణ్ రామ్ తో కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ సక్సెస్ టాక్  తెచ్చుకుంది. కల్యాణ్ రామ్ కు మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. టాలీవుడ్ కాస్త డ్రైగా ఉన్న టైమ్ లో రిలీజ్ అయిన బింబిసార, సీతారామం సినిమాలు తెలుగు సినిమాకు కాస్త ఊతం ఇచ్చాయని చెప్పుకోవచ్చు. 
 

ఇక భాషతో సబంధం లేకుండా.. సైలెంట్ గా వచ్చి..సూపర్ సక్సెస్ అందుకున్న మరో సినిమా తిరు. తమిళ స్టార్ హీరో.. ధనుష్ కు మన తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. కాని ఈసినిమా రిలీజ్ అయ్యే వరకూ ఎవరికీ తెలియని కూడా తెలియదు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కింది ఈమూవీ. ధనుష్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నిత్యమీనన్ హ్యాట్సాఫ్ అనాలి. డిఫరెంట్ లవ్ స్టోరీతో రూపొందిన ఈమూవీ తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించింది. 
 

ఇక మన దగ్గర మంచి ఎక్స్ పెక్టెషన్స్ తో రిలీజ్ అయిన సినిమా కార్తికేయా2. కార్తికేయ సినిమా మంచి హిట్ అవ్వడంతో... దానికి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 పై అంచనాలు ఉన్నాయి. కాని సడెన్ గా పాన్ ఇండియాకు వెళ్ళిన సినిమా.. హిందీ వర్షన్ లో కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమూవీ అంతా ద్వారక మిస్టరీ మీద నడవడంతో.. అక్కడివారికి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈసినిమాకు మూడో పార్ట్ కూడా ఉందంటూ హింట్ ఇచ్చారు టీమ్. అదెలా ఉంటుందో చూడాలి. 
 

ఈఏడాది మోస్ట్ ఎంటర్టైనర్ మూవీస్ లో లవ్ టుడే మూవీ కూడా ఉంది. అసలు తెలుగు వారికి తెలియని ముఖాలే అయినా.. యూత్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తో..అద్భుతమైన నటనతో .. సినిమాను రక్తి కట్టించారు. మంచి స్క్రీన్ ప్లే.. కాస్త కామెడీ.. సడెన్ గా ఎమోషన్ తో ఏడించించేశారు. అందకే తమిళంలో రిలీజ్ అయిన ఈమూవీ.. తెలుగు ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయ్యింది. 

ఇక 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. దేశాన్నే ఒక ఊపు ఊపేసిన సినిమా కాశ్మీరీ ఫైల్స్. 1990లో కాశ్మీరీ పండిట్లు ఎదుర్కోన్న ధారణాలతో కూడిన కథ ఇది. ఈమూవీ ఎమోషనల్ గా చాలా మందిని ఏడిపించేసింది. దాదాపు 300 కోట్లు వసూలు చేసిన ఈసినిమా...ప్రధాన మంత్రితో పాటు పెద్దలందరిని ఆకట్టుకుంది. అంతే కాదు కొన్ని రాష్ట్రాల్లో ఈసినిమాకు పన్ను రాయితీలు కూడా ఇచ్చారు. 

click me!