రెండో పెళ్లికి నేను రెడీ, ఈ ఏడాదే పెళ్లి.. నాగబాబు సంచలన కామెంట్స్

First Published Mar 31, 2021, 1:54 PM IST

మెగా బ్రదర్ నాగబాబు ఏళ్ల తరబడి జబర్ధస్త్ జడ్జిగా ఉండడం వలన కామెడీ , వెటకారం బాగా ఒంట బట్టించుకున్నట్లు ఉన్నాడు. కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు చూస్తే అలానే అనిపిస్తుంది. ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ఛాట్ లో పాల్గొన్న నాగబాబు షాకింగ్ ఆన్సర్స్ తో అందరి మైండ్స్ బ్లాక్ చేశాడు.. 
 

ఈ మధ్య సోషల్ మీడియా జీవిగా మారిపోయారు నాగబాబు. తరచుగా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటున్నారు. ఓ సెలబ్రిటీ లైవ్ ఛాట్ లోకి వస్తే ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, మరికొందరు తింగరి వ్యక్తులు తయారైపోతారు.
undefined
సదరు సెలబ్రిటీని తమ ప్రశ్నలతో ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్లకు మించిన క్రాక్ కలిగిన నాగబాబు వాళ్ళ తింగరి ప్రశ్నలకు వంకర సమాధానాలు చెప్పి షాక్ ఇచ్చాడు.
undefined
ఇంస్టాగ్రామ్ ఛాట్ లో పాల్గొన్న నాగబాబును, ఓ నెటిజెన్ మీకు పెళ్లి అయ్యిందా అని అడిగారు. దానికి నాగబాబు 'ఇంకా లేదు, ఈ ఏడాది చేసుకుందాం అనుకుంటుకుంటున్నా. మీరందరూ పెళ్ళికి రావాలి' అని సమాధానం చెప్పాడు.
undefined
మరో నెటిజన్, మీకు రెండో పెళ్లి చేసుకొనే ఆలోచన ఉందా? అని అడిగారు. ఈ వయసులో నాకు రెండో పెళ్లా... మీకు ఒకే అయితే నాకు కూడా రెండో పెళ్లి ఒకే' అని సమాధానం చెప్పారు.
undefined
ఓ నెటిజన్ అయితే ఏకంగా మీరు వర్జినా కాదా? అని అడుగగా, అరేయ్ ఏందిరా ఈ ప్రశ్న అంటూ స్పందించారు నాగబాబు. ఆ విధంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం చెప్పాడు నాగబాబు.
undefined
ఇక గడ్డం పెంచుతున్నారు ఎందుకంటే.. బద్దకం వలన అంటూ సమాధానం చెప్పాడు. బాలీవుడ్ లో అమితాబ్, టాలీవుడ్ లో చిరంజీవి తన ఇన్స్పిరేషన్ అని చెప్పాడు.
undefined
ఎన్టీఆర్ గురించి ఓ అభిమాని అడుగగా.. ఈ జనరేషన్ కి టార్చ్ బేరర్ లాంటి వాడని పొగడ్తల వర్షం కురిపించాడు.
undefined
అయితే బాలయ్యపై మాత్రం నాగబాబు సెటైర్ వేశాడు. మీకు నచ్చిన ఆల్కహాల్ బ్రాండ్ ఏమిటని ఓ ఫ్యాన్ అడిగారు. దానికి మాన్షన్ హౌస్ బాటిల్ ఫోటో పెట్టి, బ్లడ్, బ్రీడ్ అంటూ బాలయ్యపై సెటైర్ వేశాడు.
undefined
undefined
click me!