40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?
బాలీవుడ్ స్టార్ హీరో నటించిన 40 సినిమాలు ప్లాప్ అయ్యాయి, 33 సినిమాలు రిలీజ్ కాలేదు. మూవీ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పేస్ చేసిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో నటించిన 40 సినిమాలు ప్లాప్ అయ్యాయి, 33 సినిమాలు రిలీజ్ కాలేదు. మూవీ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పేస్ చేసిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
సునీల్ శెట్టిని బాలీవుడ్‌లో 'అన్నా' అని కూడా పిలుస్తారు. నటన, స్టైల్, డైలాగ్ డెలివరీకి పేరున్న సునీల్ శెట్టిని ఇతర నటులకంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. ఆయన జిమ్ బాడీ, , అద్భుతమైన యాక్షన్, డైలాగులు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి.
సునీల్ శెట్టి సినిమా స్టార్ గా ఉన్నారు కాని.. అసలు ఆయన చిన్నప్పుడు క్రికెటర్ కావాలనుకున్నారట. సినిమాల్లో స్థానం సంపాదించడం సులభం కాదని, ఇడ్లీలు అమ్ముకోవడం మేలని ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు స్టార్ హీరో.
కెరీర్ ప్రారంభంలో సునీల్ శెట్టి లుక్ కారణంగా చాలా తిరస్కారాలు ఎదుర్కొన్నారు. ఏ దర్శకుడూ అవకాశం ఇవ్వలేదు, ఏ హీరోయిన్ జత కట్టలేదు. సినిమాలు ఆయనకు చేతకావని దర్శకులు అన్నారట.
1992లో 'బల్వాన్' సినిమాతో సునీల్ శెట్టి కెరీర్ మొదలైంది. 1994లో వచ్చిన 'మొహ్రా' ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. తర్వాత 'గోపి కిషన్'లో డబుల్ రోల్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
‘యే తేరా ఘర్ యే మేరా ఘర్’, ‘హేరా ఫేరీ’, ‘దే దనా దాన్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 2001లో వచ్చిన 'ధడ్కన్' సినిమాకు ఉత్తమ విలన్ అవార్డు అందుకున్నారు. సునీల్ శెట్టి ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో నటించారు.
ఇన్ని సినిమాలు చేసిన సునీల్ శెట్టికి 40 సినిమాలు ప్లాప్ అయ్యాయి, 33 సినిమాలు రిలీజ్ కాలేదు. అయినా 90ల దశకంలో టాప్ హీరోలలో ఒకరు. ఇక ఆయన ఆస్తి 125 కోట్లు ఉంటుందని అంచన.
సునిల్ శెట్టిప్రేమ వివాహం చాలా చిత్రంగా జరిగింది. సునిల్ ప్రేమించిన అమ్మాయి మాన. ఆమె తండ్రి గుజరాతీ ముస్లిం, తల్లి పంజాబీ. సునీల్ శెట్టిది కర్ణాటక తుళు కుటుంబం. దాంతో వీరి పెళ్ళికి సంస్కృతి, మతం, కులం అడ్డుగా నిలిచాయి. రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ సునీల్, మాన ప్రేమను వదులుకోలేదు.
ఇరు కుటుంబాలు పెళ్ళికి ఒప్పుకునేవారకూ సునీల్, మానలు వెయిట్ చేశారు. ఇక వారి ప్రేమ బంధాన్ని చూసి వారి పెద్దలు వెంటనే పెళ్లికి ఒప్పుకున్నారు. 9 ఏళ్ల తర్వాత 1991 డిసెంబర్ 25న పెళ్లి జరిగింది.
సునీల్ శెట్టి వృత్తి కంటే వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా వార్తల్లో ఉంటారు. ఆయన పూర్తిగా కుటుంబానికి అంకితమైన వ్యక్తి. ఎక్కువగా కుటుంబంతో సమయం గడుపుతారు.