ఇంత హాట్ గా గుడ్ మార్నింగ్ చెబితే కుర్రాళ్లకు బ్యాడ్ మార్నింగే... పూజా పాప ఫోజులకు ఫ్యూజులు అవుట్!

First Published Nov 5, 2022, 1:29 PM IST

స్టార్ లేడీ పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పింది. హాట్ ఫోజు మాత్రం మైండ్ బ్లాక్ చేసేలా ఉంది.చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటున్న పూజా హెగ్డే గుండెల్లో మంటలు రేపింది. పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. 
 

Pooja Hegde


పూజా కెరీర్ కొంచెం డౌన్ అయ్యింది. ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి.  పూజా హీరోయిన్ గా నటించిన గత మూడు చిత్రాలు ప్లాప్ కావడం విశేషం. పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ వంద కోట్ల వరకు నష్టాలు మిగల్చగా... ఆచార్య ఆల్ టైం డిజాస్టర్ అయ్యింది. 
 


అలాగే  విజయ్ కి జంటగా నటించిన బీస్ట్ పరిస్థితి కూడా అంతే. విజయ్ ఇమేజ్ తో భారీ నష్టాల నుండి బయట పడినప్పటికీ బీస్ట్ ప్లాప్ రికార్డు నమోదు చేసుకుంది.ఆమె గత మూడు చిత్రాలు దారుణమైన ఫలితం  అందుకున్నప్పటికీ ఆఫర్స్ దక్కుతున్నాయి. అలాగే రెమ్యూనరేషన్ కూడా తగ్గించడం లేదు.


అయితే విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ ల జనగణమన ఆగిపోవడం పూజాకు భారీ సెట్ బ్యాక్ అని చెప్పాలి. జనగణమన ఆగిపోవడంతో పూజా కోట్ల రెమ్యూనరేషన్ కోల్పోయింది. జనగణమన చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఆమెకు ఏకంగా రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారు. ప్రాజెక్ట్ ఆగిపోవడంతో భారీ రెమ్యునరేషన్ వదులుకోవాల్సి వచ్చింది.

Pooja Hegde


 ఆమె ఖాతాలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్... త్రివిక్రమ్-మహేష్ మూవీ. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. మహేష్ 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్  2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. తెలుగులో పూజా చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ మహేష్ మూవీనే. 

పూజా హెగ్డేకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్. ప్లాప్స్ లో ఉన్న పూజాకు అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కి జంటగా పూజా ఫస్ట్ టైం నటించారు. అరవింద సమేత వీర రాఘవ మంచి హిట్ కాగా పూజాకు ఆఫర్స్ మొదలయ్యాయి. ఇక అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. వీరి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం SSMB  28.  


ఇక హిందీలో రణ్వీర్ సింగ్ కి జంటగా సర్కస్, సల్మాన్ తో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రాలు చేస్తున్నారు.  ప్రస్తుతం పూజా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ దూసుకుపోతున్నారు. 

click me!