బిగ్ బాస్ హౌస్ లో స్కిన్ షో: మోనాల్ ఆరోపణలపై నోరువిప్పిన హారిక!

First Published Jan 17, 2021, 1:55 PM IST

బుల్లితెర మరియు యూట్యూబ్ స్టార్స్ ని ఫుల్ ఫేమస్ చేసిన బిగ్ బాస్ షో. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న యూట్యూబ్ స్టార్ హారిక బాగా పాప్యులర్ అయ్యారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తన ఆటతీరుతో ఫైనల్ కి చేరిన హారికపై మరో కంటెస్టెంట్ మోనాల్ ఒక ఆరోపణ చేశారు. 
 

బిగ్ బాస్ షో నిర్వాహకులు పొట్టి బట్టలు ధరించి స్కిన్ షో చేయాలని తనను కోరారని ఆమె అన్నారు. ఐతే దానికి నేను అంగీకరించలేదని మోనాల్ చెప్పారు.
undefined
అలాగే మోనాల్ మాట్లాడుతూ.. నేను పొట్టి బట్టలు ధరించడానికి అంగీకరించకపోవడంతో హారికను అడిగారని, ఆమె దానికి ఒప్పుకుందని చెప్పడం జరిగింది. మోనాల్ వ్యాఖ్యలు బిగ్ బాస్ షో పై కొన్ని అనుమానాలు చెలరేగాయి.
undefined
దానితో పాటు హారికను కూడా మోనాల్ వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టాయని సమాచారం. అయితే మోనాల్ వ్యాఖ్యలపై హారిక స్పందించలేదు. కాగా తాజా ఇంటర్వ్యూలో హారిక దీనిపై స్పష్టత ఇచ్చారు. అసలు జరిగిన విషయం ఏమిటో తెలియజేశారు.
undefined
మోనాల్ ని పొట్టి బట్టలు ధరించాలని బిగ్ బాస్ నిర్వాహకులు అడిగారో లేదో నాకు తెలియదు. కానీ నన్ను మాత్రం అలా ఎవరూ అడగలేదు. నాకు ఇష్టం వచ్చిన బట్టలు నేను హౌస్ లో ధరించడం జరిగింది అన్నారు హారిక.
undefined
ప్రారంభ ఎపిసోడ్ లో ఇంట్రడక్షన్ సాంగ్ కోసం బట్టలు నిర్వాహకులే ఏర్పాటు చేశారు. అప్పుడు నేను వేసుకున్న డ్రెస్ మోనాల్ ని వేసుకోమని అడిగి ఉండవచ్చు. మోనాల్ చాలా హైట్ కాబట్టి ఆమె ఆ డ్రెస్ వేసుకోవడానికి నిరాకరించి ఉంటుంది.
undefined
మోనాల్ రిజెక్ట్ చేసిన డ్రెస్ నన్ను వేసుకోమన్నారు.. నేను వేసుకున్నాను. మోనాల్ కూడా ఇదే విషయం చెప్పి ఉంటుంది. కాకపోతే దానిని మీడియా వేరే కోణంలో చెప్పి పెద్ద విషయం చేశారు అన్నారు హారిక.
undefined
మరి హారిక ఇచ్చిన వివరణలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ అటు మోనాల్ ని, ఇటు బిగ్ బాస్ షో నిర్వాహకులను ఇబ్బంది పెట్టకుండా డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పి, హారిక వివాదానికి తెరదింపింది.
undefined
హౌస్ లో వీకెండ్స్ లో మోనాల్ వేసిన డ్రెస్ లు కొన్ని సార్లు వివాదాస్పదం అయ్యాయి. అలాగే హారిక సైతం పొట్టి షార్ట్స్ ధరించి స్కిన్ షో చేయడానికి ప్రయత్నించింది.
undefined
click me!