టాలీవుడ్ దర్శకులలో మంచి ఊపు మీద ఉన్న యంగ్ డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి అని చెప్పాలి. ఇంత వరకూ తాను చేసిన సినిమాల్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు లేవు. యావరేజ్ హిట్ వరకూ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి కాని ప్లాప్ లు లేవు. చాలా స్టైలీష్ గా ఉండే ఈ 40 ఏళ్ళ దర్శకుడు రీసెంట్ గా వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతున్నాడు. ఇక హీరోగా సినిమా చేస్తారట కదా.. అని అడిగితే.. అస్సలు ఛాన్సే లేదు అంటున్నాడు.
Also Read: హీరోగా అనిల్ రావిపూడి.. నిజామాబాద్ ప్రజల సాక్షిగా ఏం చెప్పాడంటే..?
ఇక హీరో మెటీరియల్అనిపించుకున్న మరో యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లాడి. 39 ఏళ్ళ ఈ దర్శకుడు చాలా హ్యండ్సమ్ గా ఉంటాడు. అసలు ఇండస్ట్రీలోకి హీరో అవ్వాలని అడుగు పెట్టిన వశిష్ట... ప్రేమలేఖ రాశా సినిమాలో హీరోగా నటించాడు. అయితే హీరోగా ముందుకు వెళ్ళడం కష్టం అనిపించిందో ఏమో తెలియదు కాని.. డైరెక్షన్ పై పట్టు సాధించాడు. కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమాతో డైరెక్టర్ గా హిట్ కొట్టిన వశిష్ట... ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నాడు.
Also Read:భార్య కాళ్లు కడిగి, నీళ్లు నెత్తిన చల్లుకున్న జబర్థస్త్ కమెడియన్,
ఇక చాలా చిన్న వయస్సులో దర్శకుడిగా ఎక్కువ సినిమాలు చేసిన ఘనత సాధించాడు ప్రశాంత్ వర్మ. 35 ఏళ్ళ ఈ దర్శకుడు.. చేసినవి.. చేస్తున్నవికలిసి దాదాపు 8 సినిమాలకు పైగా డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా.. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా హ్యాండ్సమ్ లుక్ తో ఉంటాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది.
Also Read:మళ్ళీ రొమాన్స్ మొదలెట్టిన సుడిగాలి సుధీర్ - రష్మి
photo-i dream
ఇక హీరోలా కనిపించే దర్శకులలో బాబీ కూడా ఉన్నాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో పాటు.. హ్యాండ్సమ్ లుక్ తో కనిపించే బాబు.. మెగా హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సర్ధార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వాల్తేరు వీరయ్య లాంటి మంచి సినిమాలు చేసిన బాబీ.. ప్రస్తుతం బాలయ్య హీరోగా డాకు మహరాజ్ ను తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా 12న ఈమూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇక హీరో అయ్యే అంత అవకాశం ఉన్నా.. బాబీ ఎప్పుడూ అలా ఆలోచించలేదు.
Also Read: వారసుడిని రంగంలోకి దింపబోతున్న పవన్ కళ్యాణ్, అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే..?
ఇక దర్శకుడిగా మారడంతో పాటు.. హీరోగా కూడా సినిమా చేసిన ఏకైక స్టార్ తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు సినిమాతో తాను స్టార్ గా మారి.. విజయ్ దేవరకొండకు కూడా లైఫ్ ఇచ్చిన 36 ఏళ్ల ఈ కుర్ర దర్శకుడు.. ఆతరువాత మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈసినిమాను విజయ్ దేవరకొండ నిర్మించడం విషేశం. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకపోయినా.. మంచి దర్శకుడిగా పేరు మాత్రం సంపాదించుకున్నాడు.
ఇక వీరితో పాటుగా రాహుల్ సంకృత్యన్, వెంకీ అట్లూరి, సంపత్ నంది, సుజిత్ లాంటి చాలా మంది దర్శకులు హీరోల మాదిరిగా హ్యాండ్సమ్ గా ఉంటారు. ఎలాగు డైరెక్షన్ తెలుసు.. ఇండస్ట్రీ పై పట్టు వచ్చిన తరువాత అయినా.. వారు హీరోలుగా చేస్తారా అంటే.. దర్శకులుగానే తమకు గుర్తింపు ఉంటే చాలు అంటున్నారు.