వారసుడిని రంగంలోకి దింపబోతున్న పవన్ కళ్యాణ్, అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే..?

First Published | Jan 10, 2025, 5:14 PM IST

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా నందన్ ఎంట్రీకి రంగం సిద్దం అవుతోంది. హీరోగా తన కొడుకుని పరిచయం చేసే విషయంలో పవర్ స్టార్ ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా...? 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా నందన్ ఎంట్రీకి రంగం సిద్దం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్లాలని చూస్తున్నాడట. అందుకోసం పవన్ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే పవర్ స్టార్ ఎలక్షన్స్ లో గెలవగానే ప్రభుత్వంలో భాగంగా డిప్యూటీ సీఎం గా పదవి చేపట్టారు. ఇక పార్టీ, ప్రభుత్వం ఈరెండు పనుల్లో బిజీ అవ్వడంతో సినిమాలు చేసే అవకాశం చాలా తక్కిందనే చెప్పాలి. 
 

Pawan Kalyan

ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉంచిన మూడు సినిమాలకు కాల్షీట్లు ఇవ్వడం కోసం చాలా ఇబ్బందిపడుతున్నారు. అయినా సరే ఈ సినిమాలు ఎలాగైనా కంప్లీట్ చేస్తాను అని కూడా మాట ఇచ్చారు పవన్. ఈక్రమంలో ఆయన ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేసిన తరువాత ఇక సినిమాల జోలికి వెళ్ళకుండా కంప్లీట్ గా పాలిటిక్స్ పై దృష్టి పెట్టాలని చూస్తున్నాడట. అందులో భాగంగానే ఆయన తన ఫ్యాన్స్ ను మిస్ అవ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. 


ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్ తన ప్లేస్ ను తన తనయుడితో బర్తీ చేయించాలని చూస్తున్నాడట. అందుకే పవన్ అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకి సబంధించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ రాజకీయాల్లో ఘన విజయం సాధించడం.. ఉపముఖ్యమంత్రి గా బాధత్యలు తీసుకోవడంతో పాటు.. తను ఎటు వెళ్ళినా.. తన కొడుకు అకీరా నందన్ ను తీసుకెళ్ళడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. 
 

గెలిచిన తరువాత ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబును కలవడానికి వెళ్ళినప్పుడు కూడా తన కొడుకుని తీసుకుని తిరిగారు పవన్. ఈ రకంగా పాన్ ఇండియా వ్యాప్తంగా అకీరా కు క్రేజ్ వచ్చేలాప్లాన్ చేశాడట పవన్. ఇక అకీరా కూడా అటు మార్షలాడ్స్ తో పాటు.. డాన్స్ లో కూడా ట్రైనింగ్ అయినట్టు తెలుస్తోంది. యాక్టింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాడట అకీరా నందన్. కాని సినిమా ఎంట్రీకి సబంధించి ఇంత వరకూ అప్ డేట్ మాత్రం ఇవ్వలేదు టీమ్.  
 

అకీరాను హీరోగా ఇంటర్డ్యూస్ చేసి.. తాను కంప్లీట్ గా రాజకీయాలకు పరిమితం అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట పవన్. మరి తన వారసుడిని ఎప్పుడు పరిచయం చేస్తాడు..? దర్శకుడు ఎవరు..? ఏంటీ అనేది ఎప్పుడు చెపుతాడోచూడాలి. అకీరా ఎంట్రీ గురించి ఇంత వరకూ అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. 

Latest Videos

click me!