Janaki kalaganaledu: జానకి చదువు కోసం కాలేజీకి వెళ్ళిన జ్ఞానాంబ.. జెస్సికి క్లాస్ పీకిన జ్ఞానాంబ!

First Published Aug 13, 2022, 1:12 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 12వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జ్ఞానాంబ కుటుంబంతో పాటు కాలేజ్ కి వెళ్తుంది. అక్కడ అడ్మిషన్ కోసం ప్రిన్సిపల్ దగ్గరకి వెళ్తారు. అప్పుడు ప్రిన్సిపల్ జ్ఞానాంబతో ఈ సంవత్సరం అడ్మిషన్లు అయిపోయాయి అయినా మీ మీద ఉన్న గౌరవంతో అడ్మిషన్ ఇస్తున్నాను. అత్తలు అందరూ కోడల్ని చదువుకోడానికి అడ్డుకునే వారే. అలాంటిది మీరు దగ్గరుండి కోడల్ని చదువుపిస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు అని పొగుడుతూ ఉంటుంది.ఈలోగా ఈ అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేయండి, ఫార్మల్ టీ గా ముందు కొంచెం ఫీస్ కట్టాల్సి వస్తుంది అని అంటుంది.
 

అప్పుడు జ్ఞానాంబ, గోవిందరాజు ఫీజు కట్టడానికి బయటకు వస్తారు. అప్పుడు అక్కడ జెస్సి వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చొని బర్గర్ తింటూ నవ్వుతూ ఉంటుంది. ఈ లోగా ఒక అమ్మాయి లంగా వోని వేసుకొని అక్కడికి వస్తుంది. అప్పుడు జెస్సి గట్టిగా నవ్వి ముసలోళ్ళు లాగా లంగా వోని వేసుకుంటున్నావ్ ఎందుకే? పాతకాలపు ఆలోచనలు ఇంకా పోలేదా? ఎన్ని మార్నా మీరు మారరు అని ఎటకారిస్తూ ఉంటుంది.జ్ఞానం అదంతా చూసి, చూశారా తను సరైన బట్టలు వేసుకోకపోగా సాంప్రదాయమైన బట్టలు వేసుకున్న వారిని కూడా ఎటకారిస్తుంది.
 

అసలు ఇలాంటి వాళ్ళ మధ్య మన జానకి ఉంటే తన మనసు మార్చుకుంటుందేమో అని భయపడుతుంది. అప్పుడు గోవిందరాజు జానకి ఎదుటి వాళ్ళకి చెప్పే రకం కానీ ఎదుటివారి మాటలు వినే రకం కాదు కనుక భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఆ తర్వాత సీన్లో జానకి అప్లికేషన్ నింపేసాను అత్తయ్య గారు అని చెప్పి వస్తుంది. అప్పుడు గోవిందరాజు ఫీజు కూడా అయిపోయిందమ్మా అని అంటారు. ధన్యవాదాలు అత్తయ్య గారు, ధన్యవాదాలు మావయ్య గారు మీ వల్లే నేను ఇక్కడికి రాగలిగాను.
 

నన్ను ఐపీఎస్ చదువుపించడం మీరు నాకు పెట్టే భిక్ష నేను ఐపీఎస్ అవడం మీరు నాకు ఇచ్చే వరం అని అంటుంది జానకి.అప్పుడు జ్ఞానాంబా, నేను కేవలం నా కొడుకు  బాధని చూసి నిన్ను చదువుకోడానికి ఒప్పుకుంటున్నాను కానీ నువ్వు  కేవలం చదువే కాకుండా ఇంట్లో పనులు కూడా చూడాలి .చదువు కేవలం నీ జీవితంలో ఒక భాగం కావాలి కానీ జీవితం అవ్వకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.ఈలోగా రామ కూడా నేను సాయంత్రం పనులన్నీ అయ్యేకా కాలేజీ నుంచి తీసుకెళ్లడానికి వస్తాను జానకి గారు అని వెళ్ళిపోతాడు.
 

అంతట్లో జెస్సీ వాళ్ళ ఫ్రెండ్ ని వెతుకుతూ పరిగెడుతూ ఉండగా వాచ్మెన్ ని గుద్ది వాచ్మెన్ లంచ్ డబ్బా ని కిందన పడేస్తుంది. అన్నమంతా కింద ఒలిగిపోయినా. కేవలం సారీ చెప్పి వెళ్ళిపోతుంది జెస్సీ.అప్పుడు జ్ఞానాంబ జెస్సీ దగ్గరికి వెళ్లి అసలు నీకు బుద్ధున్నదా? ఎలా పెరుగుతున్నావో తెలుసా ? ఆ బట్టలు ఏంటి అసలు? అలా అన్నం పడేసి కనీసం అతనికి తిండి ఎలాగా అని కూడా ఆలోచించకుండా వచ్చేసావు అని తిడుతుంది.అప్పుడు జెస్సీ మా అమ్మ నాన్నలు కూడా ఇలా తిట్టలేదు ఇంత గయ్యాలిగా ఉన్నారేంటి. ఇలాగ ఉంటే మీ కోడళ్ళు ఎలా బతుకుతున్నారో అని అంటుంది.
 

మా కోడళ్ళే గాని నిజంగా నీలా ఉంటే పగటిపూట చుక్కలు చూపించేదాన్ని అని అంటుంది జ్ఞానం.అప్పుడు జెస్సి నా అత్త ఇలా ఉంటే మూడు చెరువుల నీళ్లు తాగించే దాన్ని అని అంటుంది. ఆ తర్వాత సీన్లో మల్లిక, చికిత లేదు అనుకోని తినడానికి చేయి పెట్టగా చికిత అక్కడికి వచ్చేస్తుంది. ఎంత బతిమిలాడినా చికిత ఒప్పుకోకపోయేసరికి  మల్లిక తెలివిగా నేను  స్నానానికి వెళ్తాను. నీ వొళ్ళు కూడా చాలా కంపు కొడుతుంది చికిత. చీ అయినా నాకెందుకులే అని కావాలని చెప్పి వెళ్ళిపోయినట్టు నటిస్తుంది. ఈవిడ ఎలాగా స్నానానికి వెళ్లారు కదా ఎందుకైనా మంచిది నేను స్నానం చేసేద్దాము అని చికిత లోపలికి వెళుతుంది.
 

ఈలోగా మల్లికా అక్కడ నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటుంది. ఎన్నో సీరియల్ చూసిన తెలివితేటలు నావి ఇదంతా ఒక లెక్క అని తింటూ మురిసిపోతూ ఉంటుంది. ఈలోగా జ్ఞానాంబ, గోవిందరాజు అక్కడికి వస్తారు. వాళ్లని చూసి ప్లేటు వెనకాతలు పెట్టేస్తుంది మల్లిక.ఇంట్లో పనులన్నీ చేసావా అని జ్ఞానాంబా అడగగా ముద్ద నోట్లో ఉన్న మల్లి "ఉ" అంటుంది. గోవిందరాజుకి అనుమానం వస్తుంది. ఏంటబ్బా అని చూసేసరికి వెనక ప్లేట్ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!

click me!