Intinti Gruhalakshmi: నందుకి స్థలం ఇవ్వడానికి ఒప్పుకున్న ప్రేమ్.. అభికి సలహాలు ఇచ్చిన గాయత్రి?

First Published Feb 3, 2023, 10:02 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 3 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో లాస్య కోపంతో రగిలిపోతూ వస్తువులు విసిరేస్తూ ఉండగా ఆ వస్తువు వెళ్లి అనసూయకు తగలడంతో నీ కోపం తగలెయ్య నా మొఖానికి విసురుతావేంటి అని అంటుంది. ఆ విసిరేది ఏదో మీ ఆయన ముఖాన విసురుపో అనడంతో నేను విసిరేస్తానని నా దెబ్బకు భయపడి ఎక్కడో మూలన దాక్కున్నాడు అంటుంది లాస్య. దాక్కోలేదు ఏం చేయాలో తెలీకజుట్టు పీక్కుంటున్నాడు అంటుంది. ఎందుకే నీకు అంత కోపం అనడంతో నందు ఈ ఇంటీ యజమాని బలవంతంగా లాక్కోకపోవడంతో ముష్టిలాగా అడుగుతున్నాడు అని అంటుంది లాస్య. ప్రేమ్ నీ ఒప్పించే ప్రయత్నంలో తులసి ఉంది అనడంతో ఆ ఆస్తి మొత్తం మీ కొడుకు పేరు మీదకు రాసి ప్రేమ్ ని కావాలంటే అక్కడ స్టూడియో పెట్టుకోమని చెప్పండి అనడంతో నందుకు లేని అభ్యంతరం నీకెందుకు అంటుంది అనసూయ.
 

వాడు కష్టపడి సంపాదించాలి అనుకుంటున్నాడు వాడు కాదు మారాల్సింది నువ్వు అంటుంది అనసూయ. అయినా ఉత్తమ ఇల్లాలు అవ్వాలి అన్నావ్ కదా వాళ్ళ లాగా వీళ్ళ లాగా వేషాలు వేసుకుంటే అవ్వవు అర్థం చేసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనసూయ. ఆ తర్వాత తులసి శృతికి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆగు ప్రేమ్ ఏమి ఈ అమ్మ ముఖం చూడడం నచ్చడం లేదా భయపడుతున్నావా అనడంతో ఎందుకు భయం అనడంతో వెంటనే తులసి వీడికి అమ్మ ప్రేమ,అమ్మ మాటలు నచ్చడం లేదు వాళ్ళ నాన్న లాగా ఉండాలి అంట అని అంటుంది తులసి.
 

నీతో వాదించడానికి భయమేసి వెళుతున్నాను అనగా తప్పించుకొని తిరిగితే సమస్య వెళ్ళిపోదు అంటుంది తులసి. మరి అలాంటప్పుడు నాన్నకు ఒక మార్గం చూపించాలి అనుకున్నప్పుడు ఇల్లు ఆయన పేరు మీద రాసి ఇవ్వచ్చు కదా అంటాడు ప్రేమ్. ఆస్తి ఇవ్వడానికి నాకు భయం కాదు ప్రేమ్. ఆయన చేతిలో ఆస్తి పెడితే ఆ లాస్య దుర్వినియోగం చేస్తుంది అంటుంది తులసి.  ఇప్పుడు అదే జరుగుతుంది అమ్మ అనడంతో ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఆస్తిని ఆయన పేరు మీద రాసి ఇవ్వడం లేదు. నీ స్టూడియో పక్కన స్థలం ఇవ్వమని మాత్రమే అడుగుతున్నాం కదా అంటుంది తులసి.
 

స్థలం ఇవ్వగానే సరిపోదు అమ్మ డబ్బులు కావాలి అనడంతో ఆ తర్వాత అందరు కలిసి ఆలోచిద్దాం ఆయనకు అప్పు ఇప్పిద్దాం తర్వాత ఆయన తిప్పలు ఆయన పడతాడు అంటూ పిచ్చిగా అతి ప్రేమ చూపిస్తూ మాట్లాడుతుంది తులసి. అప్పుడు నందు గతంలో అన్న మాటలు అన్నీ మర్చిపోయి తులసి నందు మీద జాలి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు తులసి మాటలకు ప్రేమ్ కోపడుతూ ఉంటాడు. అప్పుడు తులసి ఎమోషనల్ గా మాట్లాడి ప్రేమ్ ని ఒప్పిస్తుంది. మరోవైపు లాస్య అనసూయ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉత్తమ ఇల్లాలు వంటి ఏదో పద్యం చెప్పి వెళ్ళిపోయింది నాకు అసలు అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అనసూయ చెప్పిన పద్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ తెలుగు డిక్షనరీలో ఆ పదాలకు అర్థం వెతుకుతూ ఉంటుంది.

 ఆ పదాలు దొరకక పోవడంతో దాని అర్థం చెప్పే వ్యక్తిని నా ముందుకు పంపించు దేవుడా అనుకుంటుండగా ఇంతలో అక్కడికి నందు వస్తాడు. ఉత్తమ ఇల్లాలు అర్థం కావాలి అంటుండగా   నీకు ఆ పద్యం అర్థం చెప్పాలి కదా అని నందు  పద్యం అర్థాన్ని తులసికి వివరిస్తూ ఉంటాడు. అప్పుడు లాస్య ఆ పద్యం అర్థం తెలుసుకున్న తర్వాత ఇది మగాడు పక్షవాతంతో తనకి అనుగుణంగా రాసుకున్నాడు అంటూ ఏదో ఒక వంకర టీంకరగా మాట్లాడుతూ ఉంటుంది లాస్య. అప్పుడు నందు అక్కడనుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తులసి అనసూయ పరంధామయ్యలకు ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళగా వాళ్ళిద్దరూ ప్లేట్ కోసం ఫ్రూట్స్ కోసం కొట్లాడుతూ ఉంటారు.
 

 నందు ఫోన్ మాట్లాడుతూ నేను కేఫ్ పెట్టడం లేదు జాబ్ చూడు వస్తాను అంటుండగా ఇందులో తులసి మీరే కేఫ్ పెడతానని చెప్పి ఇప్పుడు ఫోన్లో ఎవరితోనో కేఫ్ పెట్టడం లేదని చెబుతున్నారు ఏమయ్యింది అంటుంది తులసి. మీరు కెఫే పెట్టకూడదు అనుకున్న విషయాన్ని మాకు ఒకసారి చెప్పాలి కదా అని తులసి పరంధామయ్య అనడంతో అదేంటి నాన్న ప్రేమ్, తన స్టూడియో పక్కలో ప్లేస్ ఇస్తానని చెప్పాడా కనీసం తల ఊపాడా అని అడుగుతాడు నందు. లాస్య కూడా కేఫ్ అంటే వద్దంటుంది అందుకే నేను కూడా కెఫే ఆలోచనలను మానేసి ఉద్యోగాల కోసం వెతుకుతున్నాను అంటాడు నందు. అప్పుడు ప్రేమ్ అక్కడికి వచ్చి నేను కేఫ్ పక్కన స్థలం ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను అనడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు.
 

అప్పుడు నందు థాంక్స్ ప్రేమ్ థాంక్స్ లాస్య అనడంతో నేను ఒప్పుకున్నాను కానీ ఒక కండిషన్ అంటుంది. మూడు నెలల్లో బాగా లాభాలు రావాలి లేదంటే ఆ తర్వాత నేను చెప్పినట్టు వినాలి అని అంటుంది లాస్య. అప్పుడు నందు, ప్రేమ్ దగ్గరికి వెళ్లి హత్తుకుంటాడు. అప్పుడు శృతి అంకుల్ కేఫ్ అనడం కంటే ఏదైనా మంచి పేరు పెడితే బాగుండు అనగా వెంటనే పరంధామయ్య తులసి కంటే మంచి పేరు ఇక ఏముంటుంది అంటాడు. అంటే నా పేరు అపవిత్రమైనదా అని లాస్య కోపంతో మాట్లాడుతుంది. అప్పుడు తులసి ఎవరి పేరు వద్దు మన ఇంట్లో చిన్నవాడైన లక్కీ పేరు పెడదాము అనడంతో అందరూ సంతోషంతో చప్పట్లు కొడుతూ ఉంటారు.
 

మరొకవైపు అభి,గాయత్రి దగ్గరికి వెళ్లగా అప్పుడు గాయత్రి గ్రేట్ నందగోపాల్ గారు కేఫ్ పెడుతున్నారు అని చెప్పడానికి నా దగ్గరే మొహమాటపడుతున్నావు మరి రేపు పొద్దున్న సొసైటీలో ఎలా పేస్ చేస్తావు అంటూ అభి రెచ్చగొడుతూ మాట్లాడుతుంది. మరి ఏం చేయాలి ఆంటీ నా మాటకి ఇంట్లో ఎవరూ విలువ ఇవ్వడం లేదు అనడంతో నీ మాటకు విలువ లేని చోట నువ్వు ఎందుకు ఉన్నావు వచ్చేసేయ్ అంటుంది. అందుకే నేను ముందు ఇక్కడే ఉన్నాను మీరే కూతురు లేని చోట నువ్వు అవసరం లేదని ఇంట్లో నుంచి తరిమేశారు అంటాడు అభి. అప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంకిత నా మాట వినలేదు అనగా అలా అయితే అంకితం నీ హాస్పిటల్ లో పనిచేసేలా చేసుకో నీతో ఎక్కువ సేపు గడిపేలా చూసుకో అంటూ అభికి సలహాలు ఇస్తూ ఉంటుంది గాయత్రి.

click me!