కోట శ్రీనివాసరావు తెలుగు సినీ రంగంలో మలుపు తిప్పిన నటులలో ఒకరు. 1943లో కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని నాగమల్లు తోట గ్రామంలో జన్మించిన కోటా, మొదటిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తన జీవితం ప్రారంభించారు. అయితే, నాటక రంగంపై మక్కువతో సినీ రంగంలో అడుగుపెట్టారు.
1978లో విడుదలైన ప్రాణం ఖరీదు’ అనే సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఆఖరి పోరాటం, గోవింద గోవింద, గణేష్, మనీ, మదన వంటి చిత్రాల్లో విలన్, హాస్యపాత్రలు, ఎమోషనల్ పాత్రలతో తనదైన ముద్ర వేశారు.
700కి పైగా సినిమాల్లో నటించిన ఆయనకు అనేక అవార్డులు, ప్రశంసలు దక్కాయి. 1991లో వచ్చిన గణేష్ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.