కోట శ్రీనివాసరావు నటుడిగా జీవితాన్నే మార్చేసిన ఒకే ఒక్క మూవీ ఏంటో తెలుసా? క్రూరత్వానికి పరాకాష్ట

Published : Jul 13, 2025, 08:29 AM IST

తెలుగు తెర విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలు పోషించారు. కానీ ఆయన కెరీర్‌ని మార్చేసిన మూవీ ఒకే ఒక్కటి. అదేంటో చూద్దాం. 

PREV
15
టాలీవుడ్‌ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

తెలుగు తెర విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఆదివారం ఉదయం (జులై 13)న మరణించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 

ఇటీవలే ఆస్కార్‌ విన్నర్‌ కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా మరణం నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో దిగ్గజ నటుడు మరణించడం టాలీవుడ్‌కి తీరని లోటు అని చెప్పొచ్చు. 

అయితే 750కిపైగా చిత్రాల్లో నటించిన కోట శ్రీనివాసరావు 1978 లో `ప్రాణం ఖరీదు` మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు.

25
విలనిజానికి కొత్త అర్థం చెప్పిన కోట శ్రీనివాసరావు

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఆయనకు ఏడేళ్లు పట్టింది. 1985 ఆయన జీవితాన్నే మార్చేసింది. ఇందులో `వందేమాతరం` చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.

 టీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో విజయశాంతి, రాజశేఖర్‌ ప్రధాన పాత్రలు పోషించగా, కోట శ్రీనివాసరావు నెగటివ్‌ షేడ్‌ ఉన్న రోల్‌ చేశారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇక ఆయన కెరీర్‌కి బిగ్‌ బ్రేక్‌ ఇచ్చిన మూవీ `ప్రతిఘటన` అనే చెప్పాలి. ఈ సినిమాతో విలనిజానికి కొత్త అర్థం చెప్పారాయన. 

35
కోట శ్రీనివాసరావు జీవితాన్నే మార్చేసిన `ప్రతిఘటన`

అదే ఏడాది వచ్చిన `ప్రతిఘటన` మూవీలో విలన్‌గా విశ్వరూపం చూపించారు కోట శ్రీనివాసరావు. ఈ చిత్రం కూడా టీ కృష్ణ దర్శకత్వంలోనే రూపొందింది. 

ఇందులో విజయశాంతి, చంద్రమోహన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. చరణ్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు విలన్‌గా నటించారు. మినిస్టర్‌ కాశయ్య పాత్రలో కోట రెచ్చిపోయారు. తెలంగాణ యాసలో  అదరగొట్టాడు. 

ఈ సినిమాతోనే తెలంగాణ యాసకి ప్రయారిటీ పెరిగిందని, ఆ విషయంలో కోట పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం కోట ప్రత్యేకంగా తెలంగాణ యాస నేర్చుకున్నారు.

45
మంత్రి కాశయ్యగా క్రూరత్వానికి పరాకాష్టగా నిలిచిన కోట నటన

మంత్రి కాశయ్యగా విజయశాంతిని డామినేట్‌ చేసే పాత్రలో, ఆమెని ముప్పుతిప్పులు పెట్టే పాత్రలో అదరగొట్టాడు కోటా.  

అయితే ఇందులో మెయిన్‌ విలన్‌గా చరణ్‌ రాజ్‌ నటించగా, ఆయనకు అండగా ఉండే పాత్రలో కోట కనిపిస్తారు. అవినీతికి, కిరాతకుడిగా ఆయన నటన వాహ్‌ అనిపిస్తుంది. 

నిజంగానే ఆడియెన్స్ అసహ్యించుకునేలా నటించి మెప్పించారు. ఈ చిత్రంలోని ఆయన పాత్రకి స్పెషల్‌ జ్యూరీలో నంది అవార్డు వరించడం విశేషం.

55
విలన్‌గానే కాదు, కామెడీ పాత్రలతోనూ నవ్వులు పూయించిన కోట

ఈ సినిమాతో కోట కెరీర్‌ మారిపోయింది. ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా అత్యంత క్రూరమైన విలన్‌గా మెప్పించారు. 

అదే సమయంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా పాజిటివ్‌ రోల్స్ కూడా చేశారు. హీరోహీరోయిన్లకి నాన్నగా, మామయ్యగా, బాబాయ్‌గా ఆకట్టుకున్నారు. బాబూ మోహన్‌తో కలిసి చేసిన కామెడీ గురించి ఎంత చెప్పిన తక్కువే. 

వీరిది ఇండస్ట్రీలో బెస్ట్ జోడీ అని చెప్పాలి. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా అంతే బాగా పండేది. వెండితెరపై కామెడీతో నవ్వులు పూయించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories