జానపద పాటలు పాడుకుంటూ.. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకునే మంగ్లీ.. చిన్నగా ఆల్బమ్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఆతరువాత వరుసగా సినిమా అవకాశాలు సాధిస్తూ వస్తోంది. ఒక పాట హిట్ అవ్వడంతో మరో పాట..అలా వరుసగా సాంగ్స్ పాడేస్తోంది.రాములో రాములా, సారంగదరియా, జింతక్ చితక్, ఊరంతా, బుల్లెట్, జ్వాలారెడ్డి, కన్నే అదిరింది, రా రా రక్కమ్మ లాంటి హిట్ సాంగ్స్ ను పాడింది మంగ్లీ.