94రోజుల తరువాత జైలు నుండి బయటికి, వస్తూనే భార్గవ్ సంచలన పోస్ట్... పచ్చి బూతులు తిడుతున్న నెటిజెన్స్!

First Published Jul 22, 2021, 5:51 PM IST

మూడు నెలల క్రితం విశాఖ వేదికగా జరిగిన మైనర్ బాలిక రేప్ కేసు సంచలనం రేపింది. టిక్ టాక్ ద్వారా ఫేమ్ సంపాదించి నటుడిగా కొనసాగుతున్న ఫన్ బకెట్ భార్గవ్ బాలికను గర్భవతిని చేశాడన్న ఆరోపణలపై జైలుపాలయ్యాడు. 
 

ఫన్ బకెట్ భార్గవ్ తో బాలికకు పరిచయం ఏర్పడింది. టిక్ టాక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల పట్ల విపరీతమైన ఆసక్తి గల బాలిక భార్గవ్ మాదిరి ఫేమస్ కావాలని భావించింది.
undefined
బాలిక బలహీనతను వాడుకొని బాలికతో భార్గవ్ శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పలుమార్లు బాలికపై భార్గవ్ అత్యాచారం చేశాడు. దీనితో బాలిక గర్భవతి అయ్యారు.
undefined
తండ్రి కూడా లేని ఆ బాలిక తల్లి వద్ద పెరుగుతున్నారు. అనారోగ్యం పాలైన బాలికకు వైద్య పరీక్షలు చేయించగా, ఆమె గర్భవతి అని తేలింది. విషయం ఆరా తీయడంతో భార్గవ్ భాగోతం వెలుగుచూసింది.
undefined
దీనితో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా,భార్గవ్ ని అరెస్ట్ చేయడంతో పాటు రేప్, దిశా చట్టంతో పాటు పలు సెక్షన్స్ క్రింద బుక్ చేసి రిమాండ్ కి తరలించారు.
undefined
అప్పటి నుండి జైలు జీవితం గడుపుతున్న భార్గవ్, 94రోజుల తరువాత సోమవారం జులై 19న విడుదల కావడం జరిగింది. బయటికి వచ్చిన వెంటనే భార్గవ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ చేశాడు.
undefined
రణం... 94రోజులు, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, మీ సపోర్ట్ కావాలి.. అంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశాడు. అలాగే తన లేటెస్ట్ ఫోటో పంచుకున్నాడు.
undefined
మైనర్ బాలికను మోసం చేసి గర్భవతి చేశాడన్న కసితో ఉన్న నెటిజెన్స్.. పచ్చి బూతులు తిడుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
undefined
ఇంకా బ్రతికే ఉన్నావా అంటూ, ఏం పీకావని సప్పోర్ట్ కావాలి, నీకు అక్కా చెల్లెళ్ళు లేరా.. అంటూ మండి పడుతున్నారు. అలాగే భార్గవ్ కి సప్పోర్ట్ గా కామెంట్ చేసిన వారిని కూడా టార్గెట్ చేస్తున్నారు.
undefined
మరో పోస్ట్ లో బార్ఙ్గవ్... నేను, నాతోనే నేను, నాతోనే నిజం.. అంటూ కామెంట్ చేశాడు. పరోక్షంగా నేను ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషిని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
undefined
రిమాండ్ ముగియడంతో బెయిల్ పై బయటికి వచ్చిన భార్గవ్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. బిగ్ బాస్ షోలో భార్గవ్ పాల్గొననున్నాడని పుకార్లు రావడం విశేషం.
undefined
click me!