ఇక దిశా పటాని కొత్త బాయ్ ఫ్రెండ్ తో జతకట్టారనేది మీడియా వర్గాల వాదన. మోడల్, నటుడు అలెక్సాండర్ ఇలిక్ తో ఆమె ఎఫైర్ నడుపుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు.తరచుగా దిశా అతనితో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారు. దీంతో దిశా పటాని-అలెక్సాండర్ మధ్య ఘాడమైన ప్రేమబంధం ఏర్పడిందని బల్ల గుద్ది చెబుతున్నారు.