పబ్లిక్ గా దీపికా పిల్లికి ముద్దు పెట్టేసిన అనిల్ రావిపూడి.. సుడిగాలి సుధీర్ కి చుక్కలు చూపించారుగా..

First Published Nov 27, 2022, 12:23 PM IST

ఆహా ఓటిటి వేదికగా తెరకెక్కుతున్న వివిధ కార్యక్రమాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ మూవీస్, డాన్స్, సింగింగ్ షోలు మంచి వినోదాన్ని పంచుతున్నాయి.

ఆహా ఓటిటి వేదికగా తెరకెక్కుతున్న వివిధ కార్యక్రమాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ మూవీస్, డాన్స్, సింగింగ్ షోలు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అలాగే కామెడీ స్టాక్ ఎక్సేంజ్ అనే కామెడీ షో కూడా ప్రారంభించారు. 

ఈ షో ప్రోమో తాజాగా విడుదలై వైరల్ గా మారింది. ఈ షోకి సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి అతిథిగా హాజరయ్యారు. కమెడియన్ వేణు, సద్దాం, ముక్కు అవినాష్ లాంటి కమెడియన్లు ఈ షోలో పాల్గొంటున్నారు. 

ఈ షోలో అనిల్ రావిపూడి చిన్నపాటి రొమాంటిక్ వేషాలు వేశారు. దీపికా పిల్లిని అనిల్ రావిపూడి అందరి ముందు ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీపికా పిల్లిని చేతుల్లోకి తీసుకున్న అనిల్ రావిపూడి ఆమెకి రొమాంటిక్ గా ముద్దు పెడుతున్న దృశ్యాలు ప్రోమోలో వైరల్ అయ్యాయి. 

దీపికా పిల్లి హీరోయిన్లని తలదన్నే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె చిరునవ్వులు చూస్తుంటే ఎవరైనా మాయలో మునిగిపోతారు. అంతలా దీపికా అందంతో, చిరునవ్వుతో ఆకర్షిస్తోంది. అలాంటి దీపికా పిల్లి అనిల్ రావిపూడి లాంటి క్రేజీ డైరెక్టర్ తో రొమాన్స్ చేస్తే సోషల్ మీడియాలో రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఇక ముక్కు అవినాష్, సద్దాం లాంటి కమెడియన్లు తమ స్కిట్ లతో సుడిగాలి సుధీర్ కి చుక్కలు చూపించారు. కామెడీ పంచ్ లతో ఆట ఆడుకున్నారు. దీపికా పిల్లి తన క్యూట్ స్మైల్ తో ఈ షోలో అట్రాక్షన్ గా నిలిచింది. 

మెరూన్ కలర్ ఓపెన్ షోల్డర్ డ్రెస్ లో దీపికా పిల్లి కళ్ళు చెదిరే అందంతో ఆకట్టుకుంది. సద్దాం, ముక్కు అవినాష్, సుడిగాలి సుధీర్ కామెడీకి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అని అనిల్ రావిపూడి అన్నారు. అంతలా ఈ కామెడీ గ్యాంగ్ రచ్చ చేసింది.  

click me!